India Languages, asked by bhukurt18481, 1 year ago

Bullock cart essay in telugu

Answers

Answered by samantha379
11
ఎడ్ల బండి.. నవ నాగరికత చట్రాల కింద నలిగిపోయింది.. పండుగొచ్చినా, పబ్బమొచ్చినా, ఊరికైనా.. చెరువుకైనా.. పొలానికైనా ఎటు వెళ్లాలన్నా రైతన్నకు వెన్నుదన్నుగా నిలిచిన ఎడ్లబండి ఆగమైంది. జాతరైతే అమ్మవారి గుడి చుట్టూ ఎడ్ల బండ్లకు బదులుగా ఆటోలు, ట్రాక్టర్లను తిప్పే రోజులొచ్చాయి. ప్రత్యామ్నాయ ప్రయాణ సాధనాలు బండిని మొండి చేశాయి. ఎడ్ల బండ్లు చరిత్రలోకి వెళ్లిపోతున్నాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు వినియోగించిన కచ్రాలు ఈ పాటికే కనుమరుగవగా.. ఇప్పుడు బండ్లు కూడా కానరాని పరిస్థితి. ఒకప్పుడు ఎడ్లు, కచ్చురం బండి ఉన్న ఆ రైతు ఊర్లో శ్రీమంతుడు. ఇప్పుడు ట్రాక్టర్ ఉన్నవాడే మోతుబరి రైతు అనే రోజులు నడుస్తున్నాయి. రైతు జీవితాలతో ఎంతగానో పెనవేసుకుని, విడదీయరాని బంధం ఏర్పరుచుకున్న ఎడ్లబండ్లు నేడు కనుమరుగవుతున్నాయి. రాజులకు గుర్రపు రథాలు ఎంత ఇష్టమో రైతులకు ఎడ్లబండ్లు అంతకన్నా ఎక్కువ మక్కువ. ఆధునిక సంస్కృతికి అలవాటుపడి రబ్బరు ఇనుప చక్రాల బండ్లు రావడంతో నేడు కర్ర చక్రాల ఎడ్లబండ్లు మూలనపడడమే గాకుండా యాంత్రిక సాధనాలకు అలవడి ఎంతో మంది రైతులు ఎడ్లు, బండ్లకు దూరం అవుతున్నారు. ఎడ్ల బండ్లు ఒకప్పుడు ప్రతి రైతు ఇంటా ఉండే వాహనం, మారుతున్న కాలనికనుగుణంగా రైతుతో పెనవేసుకుని చేదోడు వాదోడుగా ఉన్న రైతు రథం నేడు కనుమరుగవుతోంది. చుట్టుపక్కల గ్రామాల్లో జరిగే సంతలు, జాతరలు, పెళ్లిలకు ఎడ్లబండ్లను వాడడమే గాకుండా తమ పంటచేలకు వెళ్లాలన్నా కూలీలను తరలించాలన్నా పండించిన ధాన్యాన్ని ఇంటికి తీసుకురావాలన్నా ఎడ్లబండి రైతుకు రథంలా ఉపయోగపడేది. ఎడ్లబండ్లు దశాబ్దం క్రితం వరకు ప్రతి గ్రామంలో ఇంటి ముందు దర్శనమిచ్చేవి. కానీ నేటి పోటీ ప్రపంచానికి తట్టుకోలేక అవికాస్తా కాలగర్భంలో కలిసిపోతున్నాయి. గతంలో కర్రతో చేసిన చక్రాల ఎడ్లబండ్లు నేడు దొరకగా పోగా కొద్దిమేర రైతులు ఇనుప చక్రాల బండ్లను వినియోగిస్తున్నారు. <h2><font color="red">వడ్రంగులు, కమ్మరులకు ఉపాధి కరువు..</font></h2> ఆసాములతో కళకళలాడిన వడ్రంగుల వాకిళ్లు పొక్కిలి లేసి దుఃఖిస్తున్నాయి. నవంబర్, డిసెంబర్ మాసాల్లో బండి పట్టాలు త యారు చేసి, వాటిని చక్రాలకు బిగిస్తూ బిజీగా గడిపిన వారి బతుకులు ఇబ్బందుల్లో పడ్డాయి. వృత్తికి ఆదరణ తగ్గడంతో ప్రత్యామ్నాయ పనులతో జీవనం సాగిస్తున్నారు. వడ్రంగులు పట్టణాల్లో ఫర్నిచర్ పనులు చేసుకొని జీవనం సాగిస్తుండగా కమ్మరుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పెట్టుబడి పెట్టగలిగిన వారు ఫ్యాబ్రికేషన్ వర్క్‌షాపులు నిర్వహిస్తుండగా పేద కమ్మరులు కార్మికులుగా పని చేస్తున్నారు. ఇంకా కొందరు వృత్తితో సంబంధం లేని పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. <h2><font color="red">రైతుకు వెన్ను దన్నుగా..</font></h2> పెద్దగా భూమి జాగలు లేకున్నా ఎడ్లు, బండి ఉంటే ఆ కుటుంబం సాఫీగా సాగిపోయేది. నారు వేయడం మొదలు పండించిన ధాన్యాన్ని మార్కెట్‌కు తరలించే వరకు బండితో రైతుకున్న బంధం విడదీయలేనిది. గడ్డి మోపులు, కలప, ధాన్యం బస్తాలు, ఎరువుల బస్తాలు మోసుకొచ్చే వాహనంగా ఉన్న ఎడ్ల బండి కనుమరుగైంది. దూర ప్రాంతాలకు వెళ్లాలంటే కచ్చురాలను ఉపయోగించే వారు. ఇప్పుడు కార్లు, బస్సులు, ఆటోల్లో గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.
Answered by mahendrabagde6846
1

I didn't know Telugu.......

Similar questions