ఒక CID ఆఫీసర్ ఒక ఫోన్ నెంబర్ ను రహస్యంగా తన పై అధికారి కి చెప్పవలసి ఉంది. అందువలన ఒక కథ రాసి పంపించాడు ఆ కధ లో ఫోన్ నెంబర్ ఉంది అని చెప్పాడు.
కథ :
మా వూరిలో శ్రీ రామనవమి ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి. పెద్దలు భక్తి పారవశ్యం లో మునిగి తెలుతుంటే పిల్లలు మరో పక్క అష్టాచెమ్మ ఆడుకుంటూ ప్రసాదాలు ఎపుడు ఇస్తారానని ఎదురుచూస్తున్నారు. మా ఊరి ప్రెసిడెంట్ గారి అబ్బాయికి రాముడు అంటే చాలా భక్తి. ఉత్సవాలకు ప్రతి సంవత్సరం పది వేలు చందా ఇస్తాడు. అయితే మా ఊరికి దూర ప్రాంతమైన చత్తిస్ ఘడ్ రాష్ట్రం లో ఉద్యోగం చేస్తుండటం వల్ల తరుచు గా రావడానికి అవ్వదు. ఈసారి వారం రోజులు ఉంటానని చెప్పాడు. కానీ ఆఫీస్ నుంచి ఫోన్ రావడం తో రెండు రోజులకే వెళ్లిపోయాడు.
ఈ కథలో ఫోన్ నంబర్ ఉంది.
Answer it genious .... ???
Answers
ఆ సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ 9841000072.
క్రింద ఇచ్చిన కథను జాగ్రత్తగా గమనించి అందులో మీకు ఏయ్ పదాలు అంకెలను గుర్తుచేస్తున్నాయో వాటిని ఒకచోట రాసుకుని చుస్తే సరి ! మీకు ఆ ఫోన్ నెంబర్ ఏమిటో తెలిసిపోతుంది .
మా వూరిలో శ్రీ రామనవమి ఉత్స్వలు బాగా జరుగుతున్నాయి పెద్దలు భక్తి పారవశ్యం లో మునిగి తెలుతుంటే పిల్లలు మరో పక్క అష్టాచెమ్మ ఆడుకుంటూ ప్రసాదాలు ఎపుడు ఇస్తారానని ఎదురుచూస్తున్నారు. మా ఊరి ప్రెసిడెంట్ గారి అబ్బాయికి రాముడు అంటే చాలా భక్తి. ఉత్సవాలకు ప్రతి సంవత్సరం పది వేలు చందా ఇస్తాడు. అయితే మా ఊరికి దూర ప్రాంతమైన చ్ఛతిస్ ఘడ్ రాష్ట్రం లో ఉద్యోగం చేస్తుండటం వల్ల తరుచు గా రావడానికి అవ్వదు. ఈసారి వారం రోజులు ఉంటానని చెప్పాడు. కానీ ఆఫీస్ నుంచి ఫోన్ రావడం తో రెండు రోజులకే వెళ్లిపోయాడు.
నవమి అనగా 9
అష్ట అనగా 8
చెమ్మ అనగా 4
పది వేలు అనగా 10000
వారం లో ఏడు రోజులు, అనగా 7
రెండు అనగా 2
ఇలా వచ్చిన అంకెలను పై నుండి కిందకు, పక్కపక్కన రాయగా వచ్చిన సంఖ్య 9841000072.
అంటే ఆ సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ 9841000072.
Learn more :
1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?
brainly.in/question/16066294
2. Essay on telugu language in telugu.
brainly.in/question/788459
3. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.
brainly.in/question/16302876