India Languages, asked by nani37, 1 year ago

description of any historical place in Telugu

Answers

Answered by navyaseeram
0
సికంద్రా లో అక్బర్ సమాధి కి దగ్గరలో ఉన్న కాంచ్మహల్ నలుచదరం గా ఉండి ఉత్తమ నైపుణ్యంతో మొఘల్ శైలి నిర్మాణాలలో ఉత్తమ నిర్మాణానికి ప్రతీక గా ఉంటుంది. చరిత్ర ప్రకారం దీనిని 1605-1619 కాలం లో నిర్మించారు. ఈ నిర్మాణం లోటైల్స్ ఎక్కువ గావాడటం వల్ల దీనిని కాంచ్ మహల్ అంటారు.కాంచ్ మహల్ పైభాగం ప్లాస్టర్ తో కప్పబడి కళా నైపుణ్యం తో చెక్కిన ఎర్ర రాయి తో నిండి ఉంటుంది. ఈ ఎర్ర రాతి నిండా లతలు,పూల తీగలు మరియు రేఖ గణిత సంబంధ డిజైన్ లతో కప్పబడి ఉంటుంది.

ఈ రాజ భవనాన్ని మొదట రాజ కుటుంబ స్త్రీల అంతః పురం కోసమని నిర్మించారు. కానీ దీనిని జహంగీరు చక్రవర్తి తరువాత కాలం లో వేటాడటానికి వచ్చినప్పుడు బస చేసే విడిది గ్రుహంగా మార్చబడింది.

రెండంతస్తులలో ఉన్న ఈ భవనంలో నలుపక్కలా చతురస్రాకారపు గదులు ఉన్నాయి. ఈ గదులు సూర్యరశ్మి ప్రసరించడానికి వీలుగా మరియు అందంగా ఉండటానికి బాల్కనీలు మరియు ఝరోఖాలతో(కిటికీ లాంటి కట్టడం) నిర్మించారు.ఈ భవనానికి నలుపక్కలా సరస్సులతో నిండి ఉన్న సుందర ఉద్యానవనం ఉంది.

Similar questions