India Languages, asked by jaiprakash75, 1 year ago

description of villages in telugu​

Answers

Answered by RapMonster1994
2

✔✅ గ్రామం (Village) లేదా పల్లె అనేది కొన్ని నివాసాల సముదాయం. ఇది నగరం లేదా పట్టణం కంటే చిన్నది. గూడెం (Hamlet) కంటే పెద్దది[1].

మనిషి సంఘజీవి కనుక ఇతరులతో అవసరాలను అనుసరించి దగ్గరగా జీవించుటకు కొందరు ఒకే చోట లేదా ఒకే ప్రాంతమును కేంద్రముగా చేసుకొని వారి వారి నివాసాలను ఏర్పాటు చేసుకోగా ఏర్పడినది ఒక గ్రామం. గ్రామాలు వాటి మధ్య వ్యాపార సంబంద కార్యకలాపాలు నెరపేందుకు వాటి కూడలిగా కొన్ని పట్టణాలు ఏర్పడతాయి. ఆయా పట్టాణాలను కేంద్రీకృతం చేసుకొని దగ్గర దగ్గరలో గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ఎక్కువ గ్రామాలు శాశ్వతంగా ప్రజలు నివాసం ఉండేవి. కాని కొన్ని గ్రామాలు తాత్కాలికం కావచ్చును. అలాగే ఎక్కువ గ్రామాలలో ఇండ్లు దగ్గర దగ్గరగా ఉంటాయి. గుడేంలో ఎక్కువగా హరిజనులు ఉంటారు కాని కొన్ని గ్రామాలలో ఇండ్లు దూర దూరంగా ఉండవచ్చును[2].

చారిత్రికంగా వ్యవసాయం గ్రామాల ఏర్పాటుకు పట్టుకొమ్మ కాని కొన్ని గ్రామాలు ఇతర వృత్తులు ఆధారంగా ఏర్పడ్డాయి. రాజకీయ, పరిపాలనా ప్రయోజనాల కారణంగానూ, పారిశ్రామిక విప్లవంఅనంతరం పరిశ్రమలు విస్తరించడం వలనా అనేక గ్రామాలు పట్టణాలుగానూ, నగరాలుగానూ వృద్ధి చెందాయి.

ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది గ్రామాలు ఉన్నందున వీటిలో ఎంతో వైవిధ్యం ఉంది. కనుక గ్రామం అంటే ఇలా ఉంటుంది అని చెప్పడం కష్టం. సుమారుగా 10 నుండి 1000 వరకు కుటుంబాలు ఉండే గ్రామాలు ఎక్కువగా ఉంటాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మొత్తం 6,38,365 గ్రామాలు (నిర్జన గ్రామాలతో కలిపి) ఉన్నాయి[3]. అధికంగా గ్రామాలలో నివాసాలు అక్కడి అవసరాలను బట్టి ఉంటాయి.

#BTS ARMY

#KOREA❤⭕✌

Similar questions