Social Sciences, asked by dhikamoldevi, 1 year ago


Difference between village and city in telugu pdf

Answers

Answered by poojan
852
పల్లెటూరు కన్నతల్లి ఒడిలాంటిది. మనకు హాయిని ఇస్తుంది. పల్లెటూరి వాతావరణం అమోఘమైనది. ఎటుచూసినా ఆప్యాయంగా పలకరించే వారే! ఒకరితో ఒకరికి విడదీయలేని సంబంధం ఏర్పడుతుంది . ఒకరి కష్టసుఖాలను మరొకరు పంచుకుంటారు. ఎటువంటి కష్టాన్నైనా కలిసి ఎదుర్కుంటారు. సాయంత్రం కాగానే అందరును ఒకచోట కలిసి జరిగిన విషయాలను తలుచుకుంటూ , నవ్వుకుంటూఉ ఆనందంగా గడుపుతారు. పల్లెటూర్లలో కాలుష్యం ఉండదు. ఎటుచూసినా చెట్లు, పొలాలు. చల్లని గాలి మన సేదతీరుస్తుంది. మనసుకి ఉల్ల్లాసాన్ని ప్రశాంతతని ఇస్తుంది. ఊరంతా పచ్చదనంతో వెదజల్లుతూ కళకళలాడుతుంది. 



ఇక నగరాల విషయాలికి వస్తే ఇక్కడ ఒకరిని పట్టించుకోవడానికి మరొకరికి తీరిక ఉండదు. ఎవరికీ వారే యమునా తీరే! అన్నట్లు ప్రవర్తిస్తారు. ఒకరికి ఏమైనా మనకు అనవసరం, మనం బాగుంటే చాలు అనే తీరుతో వ్యవహరిస్తారు. సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వరు. నిరన్తరో పనిలో నిమగ్నమయ్యేవారికి లోకపాట్లు గురించి పట్టించుకునే తీరెక్కడుంటుంది. వీలైతే వారాంతంలో కుటుంబంతో  గడుపుతారు లేకపోతే లేదు. ఇక్కడి గాలి కాలుష్యం. గాలితోపాటే మనుషుల మనసులు కూడా దురలవాట్లతో త్వరగా కాలుష్యమయ్యే ప్రదేశం ఇదే. ఫ్యాషన్ ఫ్యాషన్ అంటూ సంస్కృతిని పాడుచేసే తీరుకు నాంది పలికే చోటు ఇదే. ఇక్కడ ప్రశాంతతకు చోటు ఉండదు. 



పల్లెటూర్లలో మంచి ఆదాయం రాకపోవచ్చు, కానీ మంచి జీవితమైతే దొరుకుంతుంది. దీనిని అర్థంచేసుకోక పట్నాలకు వెళ్లే నాధుడిని కాపాడువారెవరో?  
Answered by kvnmurty
482

     మన పట్టణాలకి , పల్లెలకి  ఎంతో తేడా ఉంది.  మనుషుల స్వభావాలు, వారి ప్రవర్తనలు, అమాయకత్వం, వారు చేసే పనులు, వారి దినచర్యలు, ప్రేమలు అనుబంధాలు, ద్వేషాలు ఈ అన్నింటిలోనూ పట్టణ వాసులకి , పల్లెటూరి ప్రజలకి చాలా తేడా ఉంది.

 

    నివసించే ప్రాంతం, వాతావరణం, సౌలభ్యం, రవాణా సౌకర్యాలు, విద్య నేర్చుకొనే బడులు, కళాశాలలు వారిలోని ఉపాధ్యాయుల శక్తి సామార్ద్యాలు ఇలా ఎన్నో విషయాల్లో పల్లెటూరు నగరాలకన్నా వెనుకబడి ఉన్నాయి.  వాతావరణ కాలుష్యం మాత్రం భగవంతుని దయ వల్ల ఊరిలో ఇంకా తక్కువే ఫాక్టరీ కి దగ్గరగా ఉంటే మాత్రం దుర్భరం.  అనుబంధం ఆత్మీయత ల విషయానికొస్తే ఊరి ప్రజలు ఆప్యాయంగా పలుకరిస్తారు.  ఇంకా మన పల్లెటూళ్లలో కంప్యూటర్ , ఇంటర్నెట్, సౌకర్యాలు పూర్తి గా లేవు. ఇపుడే వస్తున్నాయి.

 

   చాలామంది పల్లె ప్రాంతానికి  పోడానికి ఇష్టపడరు.  వినోద కార్యక్రమాలు, చూడడానికి వింతలు, అనేక రాజకీయాలు , సమావేశాలు, సభలు, కవిత్వ సాహిత్య సమ్మేళనాలు నగరాలలోనే  ఎక్కువ.  ఉద్యోగ అవకాశాలు కూడా నగరాలలోనే ఎక్కువ.  ఇంకా కొన్ని పల్లెటూళ్లలో అయితే మరుగుదొడ్లు కూడా లేవు. పాఠశాలల్లో అన్నిసౌకర్యాలు ఉన్నట్టులేవు. 

    పల్లెటూరు మన భాగ్యసీమ అన్నారు కానీ  నగరాలు మాత్రమే భాగ్యసీమలు ఇప్పటి ప్రపంచంలో.
Similar questions