elephant in telugu matter
Answers
ఏనుగు పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం ఏనుగు (అయోమయ నివృత్తి) చూడండి.ఏనుగుటాంజానియాలోని ఆఫ్రికా ఏనుగు.శాస్త్రీయ వర్గీకరణరాజ్యం:ఏనిమేలియావిభాగం:కార్డేటాఉప వర్గం:సకశేరుకాలుతరగతి:క్షీరదాలుక్రమం:ProboscideaSuperfamily:Elephantoideaకుటుంబం:ఎలిఫెంటిడే
Gray, 1821ఉపకుటుంబంSee Classification
ఏనుగ లేదా ఏనుగు (ఆంగ్లం Elephant) ఒక భారీ శరీరం, తొండము కలిగిన జంతువు. ప్రస్తుతం భూమిపై సంచరించే జంతువులన్నింటిలోకి ఏనుగే పెద్దది. దీని గర్భావధి కాలం 22 నెలలు. ఏనుగు 70 సంవత్సరాలు కంటే ఎక్కువగా జీవిస్తుంది. ఏనుగులు రెండు రకాలు: ఆఫ్రికా ఏనుగు మరియు ఆసియా ఏనుగు. హిందువులు ఏనుగును వివిధరకాలుగా పూజిస్తారు. ఇవి పూర్తిగా శాఖాహారులు మరియు బాగా తెలివైనవి.
విషయ సూచిక [దాచు] 1భాషా విశేషాలు2ఆఫ్రికా ఏనుగు3ఆసియా ఏనుగు4మానవులతో సంబంధం5దేవాలయాల్లో ఏనుగుల వాడుక6హిందూ పురాణాలలో7ఇవి కూడా చూడండి8ఇతర పేర్లు9మూలాలుభాషా విశేషాలు[మార్చు]ఆఫ్రికా ఏనుగు[మార్చు]ఆఫ్రికా ఏనుగులు (ప్రజాతి Loxodonta) ఆఫ్రికా ఖండంలో 37 దేశాలలో విస్తరించి ఉన్నాయి. ఇవి ఆసియా ఏనుగులకంటే పెద్దవిగా ఉంటాయి. వీటి వెనుకభాగం పుటాకారంలో ఉంటుంది. వీటి చెవులు చాలా పెద్దవిగా ఉంటాయి. విశేషమేమిటంటె, వీటి చెవులు ఆఫ్రికా ఖండం ఆకారంలో ఉంటాయి. ఆడ, మగ ఏనుగులు రెండూ దంతాలు కలిగి ఉంటాయి. శరీరం పై వెండ్రుకలు, ఆసియా ఏనుగుల కంటే తక్కువగా ఉంటాయి.
ఆసియా ఏనుగు[మార్చు]ఆసియా ఏనుగులు (Elephas maximus) ఆఫ్రికా ఏనుగుల కంటే చిన్నవి. చెవులు చిన్నవిగా ఉంటాయి. మగ ఏనుగులకు మాత్రమే పెద్ద దంతాలుంటాయి. మొత్తం ఏనుగులలో 10 శాతం మాత్రమే ఆసియా ఏనుగులు. జన్యు వ్యత్యాసాల ఆధారంగా, ఏనుగులను మూడు ఉపజాతులుగా విభజించారు.
శ్రీలంక ఏనుగు (Elephas maximus maximus) ఆసియా ఏనుగులన్నింటిలోను పెద్దది. ఇవి శ్రీలంకలో మాత్రమే ఉన్నాయి. ఇవి ఇంచుమించు 3,000-4,500 వరకు ఉన్నాయని అంచనా. ఇవి సుమారు 5,400 కి.గ్రా. బరువుండి 3.4 మీ. ఎత్తుంటాయి.భారతదేశపు ఏనుగు (Elephas maximus indicus) ఆసియా ఏనుగులన్నింటిలో సంఖ్యలో ఎక్కువగా, అంటే 36,000 వరకు ఉన్నాయని అంచనా. ఇవి భారతదేశం నుండి ఇండోనేషియా వరకు విస్తరించి ఉన్నాయి. ఇవి ఇంచుమించు 5,000 కి.గ్రా. బరువు ఉంటాయి.సుమత్రా ఏనుగు (Elephas maximus sumatranus) ఇవి అన్నిటికన్నా చిన్న పరిణామంలో ఉంటాయి.మానవులతో సంబంధం[మార్చు]బరువులు లాగుతున్న ఏనుగుల చెక్క చిత్రంతిరుగుబాటు చేసిన ఖాన్ జహాన్ను బహదూర్ ఖాన్ తో మొఘలులు యుధ్ధసమయంలో ఉదయ్ అనే ఏనుగుతో పోరాడుతున్న చిత్రానంద్ అనే ఏనుగు- అక్బనామా నుండి ఒక దృశ్యం.ప్రాచీన భారతదేశంలో మొదటిసారిగా ఏనుగులను మచ్చికచేసుకున్నారు. ఏనుగులు కష్టపడి పనిచేసే జంతువులు. అడవులలో భారీ వృక్షాలను పడగొట్టడానికి, తరలించడానికి ఉపయోగిస్తారు. ఇలాంటి పనులను ముఖ్యంగా ఆడ ఏనుగుల నుపయోగించేవారు.యుద్ధాలలో ఏనుగులను భారతదేశంలోను, తర్వాత పర్షియాలోను ఉపయోగించారు. వీటికోసం ముఖ్యంగా మగ ఏనుగులను మాత్రమే పనికొస్తాయి. భారీ పనులకోసం, వృక్షాలను కూల్చడానికి, పెద్దపెద్ద దుంగలను కదిలించడానికి, యుద్ధఖైదీలను వీటి పాదాలక్రింద తొక్కించడానికి వాడేవారు.మహారాజులు అడవులలో క్రూరమృగాలు, ముఖ్యంగా పులుల్ని వేటాడటం కోసం ఏనుగులమీద వెళ్ళేవారు. కొన్ని దేవాలయాలలో ఊరేగింపులలో ఏనుగుల్ని ఉపయోగిస్తారు.ప్రపంచవ్యాప్తంగా జంతుప్రదర్శనశాల లలో మరియు సర్కస్ లలో ఏనుగులు ప్రధాన ఆకర్షణలు.గజారోహణం, గండపెండేరం లతో మహారాజులు ఆనాటి గొప్ప కవులను, పండితులను సన్మానించేవారు.దేవాలయాల్లో ఏనుగుల వాడుక[మార్చు]భారత దేశములోనే కాక పలు ఇతర దేశాలలో సైతం దేవాలయాల యందున ఏనుగులను వాడటం జరుగుతున్నది. ముఖ్యంగా దక్షణ భారత దేశ ప్రధాన దేవస్థానములవారు స్వామి యొక్క అన్ని ఉత్సవములయందున తప్పక హస్తి యొక్క సేవలను తీసుకొంటారు. ఊరేగింపులలోనూ, దేవాలయ ప్రధాన ద్వారముల వద్ద వీటిని అధికముగా వీక్షించవచ్చు.
హిందూ పురాణాలలో[మార్చు]హిందూ దేవుడు వినాయకుడు తలఖండించిన శివుడు ఏనుగు తలను తెచ్చి అతికించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి.గజేంద్ర మోక్షములో విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో మొసలిని సంహరించి గజేంద్రున్ని రక్షిస్తాడు.క్షీరసాగర మథనంలో పుట్టిన ఐరావతం అనే తెల్లని ఏనుగు, ఇంద్రుని వాహనము.గజలక్ష్మి అష్టలక్ష్ములులో ఒకరు.ఇవి కూడా చూడండి[మార్చు]గజేంద్ర మోక్షముఇతర పేర్లు[మార్చు]కరిగజముదంతిహస్తిమూలాలు[మార్చు]వర్గాలు: 'జాతి' మైక్రో తీరులు గల వ్యాసాలుక్షీరదాలు