Essay on Dusshera in Telugu
Answers
దసరా ఒక ముఖ్యమైన హిందూ పండగ. దసరా పండగ యొక్క ప్రాముఖ్యత దానియొక్క మతపరమైన విలువలో ఉండును. దసరా పందుగ మనకు చెడును జయించడం నేర్పిస్తుంది. రావనాసుడిపై రాముడి విజయాన్ని గౌరవిస్తూ ఈ పండగను భారత దేషమంతా జరుపుకుంటారు. ఈ పండగ సాధారనంగా అక్తోబరు నెలలో వచ్చును.
దసరా పండగ వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా జరుపుకుంటారు. పంజాబులో దసరా అండుగను పదిరోజుల వరకూ జరుపుకుంటారు. అభ్యాసము గల పండితులు రామయనంలోని కొని రచనలను ఉచ్చరించుదురు. వాటిని ప్రజలు గొప్ప వినయంతొ ఆలకించుదురు. దాదాపు అన్ని ప్రాంతాలలో రామ లీలను కొన్ని రాత్రులు ప్రసంగించెదరు. వేలకొలది ప్రజలు దానిని ఉత్సాహించడానికి వెల్లెదరు.
పండుగ రాముడు మరియు సీత ఒకరియెడల ఒకరికి ఉన్న ప్రేమను, గౌరవాన్ని కూడా తెలియజేస్తింది. రాముడు ఆదర్షకరమైన భర్త మరియు సీత ఆదర్షకరమైన భార్య. సీతారామ కల్యానం గొప్ప ఉత్సాహముతో జరిపించెదరు. వివాహ ఊరేగింపు పట్టనపు ప్రధాన వీదులలోనుండి వెల్లును. ఆరోజు పట్టనమంతటిలో గొప్ప ఉత్సాహ కదలికలు ఉండును. బాల్కనీలు మరియు పైకప్పులు ఆడ, మగవారితో నిండిపోయి ఉండును. ఆ ద్రుష్యాలు చూడడానికి ప్రేక్షకులు ఆసక్తితో వీధులలో బారులు కట్టెదరు. ఆ మార్గమంతా ప్రజలతో నిండిపోవును. ప్రధాన మార్కెట్టు ద్వారా రావడానికి చాలా కష్టమవుతుంది.
Answer:
దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పదవరోజు పార్వేట ఉంటుంది.
దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. తెలంగాణాలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం ఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం రివాజు. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదే విజయదశమి. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశములో హెచ్చుగా ఉంటుంది.
ఆర్.యస్.యస్. సంస్థాగత స్థాయిలో వారు అధికారికంగా జరుపుకునే ఆరు పండుగలలో ఇది ఒకటి. ఇతర ఐదు పండుగలు హిందూ సామ్రాజ్య దినోత్సవం, మకర సంక్రాంతి, ఉగాది, గురుపూర్ణిమ, రక్షాబంధన్ మహోత్సవ్ గా ఉన్నాయి.
Explanation:
HOPE IT HELPS YOU.