India Languages, asked by rishilaugh, 1 year ago

Essay on jawahar Lal nehru in telugu

Answers

Answered by phillipinestest
25

జవహర్ లాల్ నెహ్రూ పై వ్యాస:

ఏటా నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా అత్యంత సంతోషంగా ఓ వేడుకలా జరుపుకుంటాం. స్వాతంత్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజునే బాలల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఆయన జన్మదినాన్ని ‘చిల్డ్రన్స్ డే’గా నిర్వహించుకోవడానికి బలమైన కారణం ఉంది. ప్రపంచ దేశాలన్నీ నవంబర్ 20న బాలల దినోత్సవం జరుపుకుంటాయి.. కానీ, భారత్‌లో మాత్రం ఆరు రోజులు ముందుగానే దీన్ని నిర్వహించుకుంటారు.

తన పుట్టిన రోజును పసిపిల్లలకు పండుగ రోజుగా జరపాలని కోరుకున్న చాచాజీ జీవితం గురించి ఈ సందర్భంగా క్లుప్తంగా తెలుసుకుందాం. జవహర్‌లాల్ నెహ్రూ 1889 నవంబర్ 14వ తేదీన అలహాబాదులో జన్మించారు. పుట్టుకతోనే ధనవంతుడైన ఈయన దేశం కోసం అన్నింటినీ త్యాగం చేసి, మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడిచి ఆయనకు రాజకీయ వారసుడిగా నిలిచారు.

గొప్ప వక్తగా, విద్యావేత్తగా, మంచి తండ్రిగా పేరు గడించిన చాచాజీ.. స్వాతంత్ర్య పోరాట కాలంలో జైళ్లలో గడపటంవల్ల ఎక్కువకాలం భార్యా పిల్లలతో గడపలేకపోయారు. సహాయ నిరాకరణోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన ఈయన.. భారత జాతీయ కాంగ్రెస్‌కు 4సార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహం ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించారు.

గురించి మరింత తెలుసుకోవడానికి జవహర్లాల్ నెహ్రూ:

https://brainly.in/question/788558

Answered by srinukanamareddy7
9

Answer:

hope this helps u FRIENDS

Attachments:
Similar questions