India Languages, asked by josyualjahnavi, 7 months ago

essay on newspaper in Telugu language​

Answers

Answered by rrr7397
5

Answer:

వార్తాపత్రిక ఒక ముద్రిత మీడియా మరియు ప్రపంచంలోని మాస్ కమ్యూనికేషన్ యొక్క పురాతన రూపాలలో ఒకటి. వార్తాపత్రిక ప్రచురణలు రోజువారీ, వార, పక్షం రోజుల వంటి ఫ్రీక్వెన్సీ ఆధారితవి. అలాగే, నెలవారీ లేదా త్రైమాసిక ప్రచురణను కలిగి ఉన్న అనేక వార్తాపత్రిక బులెటిన్లు ఉన్నాయి. కొన్నిసార్లు ఒక రోజులో బహుళ సంచికలు ఉన్నాయి. ఒక వార్తాపత్రికలో రాజకీయాలు, క్రీడలు, వినోదం, వ్యాపారం, విద్య, సంస్కృతి మరియు మరిన్ని అంశాలపై ప్రపంచవ్యాప్తంగా వార్తా కథనాలు ఉన్నాయి

Answered by BrainlyGorgeous
21

వార్తాపత్రికలు :

ప్రచార సాధనాల్లో ప్రముఖ పాత్ర వహించేవి వార్తాపత్రికలు. ఒక్క పత్రిక పదివేల సైన్యంతో సమానమని మన పెద్దలు భావించారు. ఈనాడు వార్తాపత్రికలు గొప్పగా జాతికి ఉపయోగపడుతున్నాయి. ప్రపంచంలో గల అన్ని దేశాలలోని వింతలు, విశేషాలని మనకి తెలియజేసెందుకు వార్తాపత్రికలు బాగా ఉపయోగపడుతున్నాయి.

ఈ పత్రికల వల్ల మానవ జాతికి చాలా లాభాలు ఉన్నాయి. పత్రికలను నిత్యం చదవడం వల్ల అనేక విషయాలు తెలుస్తాయి. చదివేవారికి ప్రపంచ జ్ఞానం తెలుస్తుంది. మనుషుల దృష్టి విషాలమవుతుంది. ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి, వాటిలోని మంచి చెడుల గురించి, అవి అమలు జరుగుతున్న తీరును గురించి ఈ పత్రికలు వివరిస్తాయి. ఇవి ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధుల్లాంటివి.

Similar questions