India Languages, asked by arpitanayak6153, 11 months ago

Essay on safe Diwali in Telugu

Answers

Answered by AngelSahithi
1

Answer:

పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ దీపావళి. ఏటా దీపావళి రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొత్త కాకపోయినా... వాటి గురించి మరోసారి తెలుసుకుంటే మరిచిపోయిన అంశాలు గుర్తుకువస్తాయి. దీంతో దీపావళి ఆనందాన్ని ఏమాత్రం కోల్పోకాకుండా, సురక్షితంగా జరుపుకోవడమే మన లక్ష్యం కావాలి. టపాసులు కాల్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే విషాదం బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. నిపుణులు కొందరు సూచించినట్టు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

చేయకూడనివి పేలకుండా మధ్యలో ఆగిపోయిన టపాసులను తిరిగి వెలిగించే ప్రయత్నం చేయరాదు. అదిపైకి మండకపోయినా లోపల ఉండిపోతే దాన్ని చేతిలోకి తీసుకోగానే పేలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. ముందు జాగ్రత్తగా అలాంటివాటిపై నీటిని చల్లి తడపండి.

బాణాసంచా ఎప్పుడూ ఇంట్లో కాల్చేందుకు ప్రయత్నించవద్దు. బహిరంగ ప్రదేశాల్లోనే వాటిని పేల్చండి.

జేబుల్లో టపాసులు పెట్టుకుని తిరగడం చాలా ప్రమాదకరం.

గాజు కంటెయినర్లు, లోహపు పాత్రల్లో టపాసులు పేల్చడం ప్రమాదకరం.

చేయాల్సినవి

బాణాసంచాను పేల్చడానికి ముందు, ప్యాకింగ్‌లపై ఉండే సూచనలు చదవండి. ఆ సూచనలను పనిగట్టుకుని చదవడానికి అంత పెద్ద విషయమా అని అలుసుగా తీసుకోకండి.

మంటలు అంటుకునే అవకాశం గల ప్రాంతాలకు దూరంగా బాణాసంచాను పేల్చాలి. భవనాలు, చెట్లు, ఎండుగడ్డి లాంటి చోట టపాసులు పేల్చడం వల్ల అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ.

కాల్చిన బాణాసంచా సామాగ్రిని ఇసుక పోసి ఓ ప్లాస్టిక్ బకెట్‌తో కప్పి ఉంచండి. దీనివల్ల ఆ దారిలో వేళ్లేవారికి హాని కలుగకుండా ఉంటుంది.

టపాసులు కాల్చేసమయంలో ముందు జాగ్రత్తగా బక్కెట్‌తో నీటిని సిద్ధంగా ఉంచుకోండి.

బాణాసంచా కాల్చేటప్పుడు చేతులను టపాసుకు దూరంగా ఉంచి జాగ్రత్తగా అంటించాలి. అలాగే టపాసుకు ముఖాన్ని దూరంగా ఉంచడం మర్చిపోవద్దు.

చిన్నారుల విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నారులను పెద్దలు తమవద్దే అట్టిపెట్టుకోవాలి. టపాసుల గురించి అంతగా తెలియని పిల్లలు వెలుగుతున్నప్పుడు వాటిని ముట్టుకుంటే ప్రమాదం. అలాగే, కాలిన టపాసులను చిన్నారులకు దూరంగా పెట్టండి.

mark me as brainliest

Similar questions