India Languages, asked by maheen3, 1 year ago

essay on strila chduvu samaajaaniki velugu

Answers

Answered by kvnmurty
22
               స్త్రీల  చదువు  సమాజానికి  ఎంతో  వెలుగు

   మన సమాజం లో స్త్రీలు పురాతన కాలం నుండి అనాది గా  ఇల్లు చక్క బెట్టడం లోను, పిల్లలను కని పెంచడం లోను తమ బాధ్యతలను చక్కగా నిర్వర్తించారు. గృహ సీమలోనే తమ కుటుంబాలను చక్క దిద్ది వారిని పది మంది మధ్యలో గొప్పవారిగా చేసి తరించేవారు. కానీ తమకంటూ ఒక గుర్తింపు విడిగా పొందేవారు  కాదు. వారి చదువు వారి అమ్మ, అక్క, చెల్లి, అన్న , తమ్ముడు , అత్తగారు, ఆడపడుచుల వల్లనే ఉండేది. అది ఇంటికి పనికివచ్చేదే అయ్యేది.  విజ్ఞానం బాహ్య ప్రపంచం అవి తక్కువ. 

   స్త్రీలు తాము నేర్చుకొన్న అన్నీ విశేషాలు , జ్ఞానం తమ భర్తల కోసం పిల్లల కోసం ఉపయోగిస్తారు. అందుకని ఒక నానుడి ఉంది. ఏమిటంటే  ఒక మగవాడు విద్యా భ్యాసం చేస్తే ఒక మనిషే నేర్చుకొంటాడు. కానీ ఒక ఆడది నేర్చు కొంటే అపుడు తన కుటుంబం అంతా నేర్చుకొన్నట్లే.  అందుకని స్త్రీలు విద్య నేర్చుకోవడం చాలా మంచిది. ఆ జ్ఞానం తరతరాల వరకు వారి వంశం లో పిల్లలకి మగవారికి ఉపయోగ పడుతుంది. స్త్రీలు సమయానుకులం గా వారి విద్యను , విజ్ఞానం ను వినియోగిస్తారు. 

   స్త్రీ లు విద్యనభ్యసించడం వల్లన వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి, మంచి ఆహారం గురించి , ఆహార మరి ఇతర పదార్ధాల ధరలు గురించి ఎన్నో విషయాలు తెలుసుకొంటారు. త్వరత్వరగా మారే ఈ సమాజంలోని మార్పులు అర్ధం చేసుకొని వారు వారి కుటుంబ సభ్యుల మధ్యన మంచి ఉంటూ , వారి మధ్యన సమన్వయం కుదిరేలా చూస్తారు.  అందుకని స్త్రీలు నేర్చుకొనడం వల్లన కుటుంబాలు , కుటుంబాల వల్లన సమాజం ఎంతో బాగుపడతాయి. నవ సమాజ వికాసానికి ఎంతో దోహద పడుతుంది. స్త్రీలు చిన్నవారు కానీ పెద్దవారు కానీ వయసు తో సంబంధం లేకుండా వారి చదువు అందరికీ ఉపయోగ పడుతుంది.  అందుకనే స్త్రీల చదువు సమాజానికి వెలుగు. 

kvnmurty: :-)
Answered by suggulachandravarshi
8

Answer:

స్త్రీల చదువు సమాజానికి ఎంతో వెలుగు.

Similar questions