Essay on television effects on humans relation in Telugu
Answers
మానవసంబంధాల పై టీవీ ప్రభావం:
టీవీ అనేది ఈ రోజులలో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఒక అత్యవసరమైన వస్తువుగా మారిపోయింది.ఈటీవీ యొక్క ప్రభావం మానవ సంబంధాల పై చాలానే ప్రభావం చూపిస్తున్నది. ఇది కొన్ని విధాలుగా ఆలోచిస్తే మంచిది అయినప్పటికీ చాలా విధాలుగా చెడు ప్రభావాన్ని, మనుషుల వారి జీవితాలపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది.
మామూలుగా టీవీ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో హాల్లో వుండేది కానీ ఈ రోజులలో ప్రజలు ఎలా మారిపోయారు అంటే వారు ఎక్కడ ఉంటే అక్కడ టీవీని అమర్చుకునే విధంగా అంటే అది వంటగది కావచ్చు, పడకగది కావచ్చు ఎక్కడైనా సరే టీవీ ఉండాలని కోరుకుంటున్నారు. దీనివలన ఒకరితో ఒకరికి ఉండవలసిన కనీసం మాటలు కూడా లేకుండా జీవితం సాగిస్తున్నారు.
ముఖ్యంగా టీవీలో వస్తున్నటువంటి ప్రసారాలు అందులోనూ ఈ సీరియల్స్ ఆడవాళ్ళ పై చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఏదైనా టీవీలో వచ్చే ప్రోగ్రాం అందరూ ఆనందించేది గా ఉండాలే కాని అది వారి జీవితాల్లో సమస్యగా మారిరాదు.
ఈ రోజులలో అదే నిత్యం జరుగుతూ ఉండడం చాలా ఇళ్లల్లో గమనించవచ్చును కానీ ఈ రోజులలో చాలా కుటుంబాల్లో నిత్యం ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉండడం మనం గమనించవచ్చు ఇందులో పెద్దవారు చిన్నవారు అని తేడా లేకుండా అందరూ టీవీతో మమేకమై పో వాళ్ల మధ్య ఎటువంటి సంభాషణలు లేకుండా ఉండటం చాలా కుటుంబాల్లో మనం చూస్తూ ఉన్నాము.
టీవీ మానవ సంబంధాల్ని పెంచేదిగా ఉండాలి కానీ తుం చేసేదిగా ఉండకూడదు. టీవీ అనేది మానవుని ప్రవర్తన అతనికి ఇతరులతో ఉండే సంబంధాన్ని రోజురోజుకీ తగ్గిస్తుందని కానీ పెంచటం అనేది జరగటం లేదు. టీవీలో వచ్చే చాలా ప్రోగ్రామ్స్ లో హింసాత్మకమైన సందేశాలు ఎక్కువగా ఉంటున్నాయి ఇవన్నీ నిజమేనా అని మానవులు నమ్మి అవే తమ తమ జీవితాలలో ప్రయత్నించటం వలన చాలా సమస్యలు వస్తున్నాయి.
ఆ టీవీలో వచ్చే ప్రసారాలలో నిజం కన్నా కల్పితమే ఎక్కువగా ఉండటం దానిని మనుషులను నమ్మటం ఒక పెద్ద సమస్యగా పరిణమిస్తుంది. ఈ రోజులలో టీవీ అనేది ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని పంచేది గా ఉండటం కన్నా అదే ఒక వ్యసనంగా మారి పోవడం అనేది మనం చాలా కుటుంబాల్లో చూస్తున్నాము.