India Languages, asked by halfdinner2647, 10 months ago

Telugu essay on trip to Rajasthan

Answers

Answered by pmaheshwari635
0

Answer:

hmfbmcb. - bmcbmcxnb. xnmcnvnvm f ex nvfh; FC b.

Answered by dreamrob
1

రాజస్థాన్ ప్రయాణము:

రాజస్థాన్ అనేది ఒక పెద్ద రాష్ట్రము. భారతదేశంలో రాజస్థాన్ వైశాల్యం ప్రకారం ఒక అతి పెద్ద రాష్ట్రము. రాజస్థాన్ ఉత్తర భారత దేశంలో ఉన్నది నేనూ నా కుటుంబ సభ్యులు ఒక రోజు రాజస్థాన్ చూసి రావాలి అని అనుకున్నాము. మా కుటుంబ సభ్యులంతా కలిసి రాజస్థాన్ కి బయలుదేరాము.

మొదటగా మేము జైపూర్ నగరానికి వెళ్ళాము. అక్కడ చాలా కట్టడాలు ఉన్నాయి రాజస్థాన్ లో ఎన్నో కట్టడాలు ఇప్పటికీ క్షత్రియుల రాచరికానికి చరిత్రకి అద్దం పడుతుంటాయి. రాజస్థాన్ ప్రజలు అక్కడి సాంప్రదాయాలను ఆచారాలను చాలా గౌరవిస్తారు తు.చ తప్పకుండా పాటిస్తారు అందుకే అక్కడి ప్రజలు చాలా సురక్షితంగా ఉంటారు అక్కడ వారి మధ్య ఎటువంటి తగాదాలు వివాదాలు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి.

మొదటిగా మేము రాజస్థాన్ లో ఉన్నటువంటి బ్రహ్మ మందిరాన్ని దర్శించుకున్నాము ఈ బ్రహ్మ మందిరం అజ్మీర్ లోని పుష్కర్ లో ఉంది ఇక్కడ బ్రహ్మ దేవుడిని పూజిస్తారు. ప్రపంచంలో బ్రహ్మదేవుడిని పూజించే మందిరం ఇది ఒక్కటే.

రెండవ రోజు మేము మహాదేవ మందిరాన్ని దర్శించుకున్నాము మౌంట్ అబూ వద్ద దగ్గర్లో ఉన్న శివాలయం మందిరం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ శివలింగం బదులుగా శివుని శిల్పం, విగ్రహం ఉన్నాయి.

మూడవ రోజు మేము అంబికా మాతా మందిర్ అని దర్శించుకున్నాము ఉరుకు 50 కిలోమీటర్ల దూరంలో మౌంట్ అబూ వద్ద జగత్తు అనే గ్రామంలో ఉన్న దుర్గా దేవి మందిరం.

మా ఈ మూడు రోజుల ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా చాలా సంతోషంగా గడిచినది రాజస్థాన్లో ఇంకా చూడదగ్గ కట్టడాలు ప్రదేశాలు చాలా ఉన్నాయి రాజస్థాన్ ప్రజలు హిందీ రాజస్థానీ భాషలు మాత్రమే మాట్లాడతారు ఈ విధముగా రాజస్థాన్ ప్రయాణము ముగిసినది.

Similar questions