English, asked by kumaripinisetty85, 1 year ago

Essay on yarla pragada subbaravu in telugu

Answers

Answered by keerthika6
0
యల్లాప్రగడ సుబ్బారావు (జనవరి 12, 1895 - ఆగష్టు 9, 1948) భారత దేశానికి చెందిన వైద్య శాస్త్రజ్ఞులలో చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. లెడర్లీ ప్రయోగశాలలో వైద్యబృందం నాయకులుగా ఫోలిక్ ఆమ్లం యొక్క నిజస్వరూపాన్ని కనుగొన్నాడు. అందులోని బంగారు వన్నె భస్మం స్ప్రూ వ్యాధి, మక్రోసైటిక్ అనీమియా అను రక్తహీనత వల్ల కలిగే వ్యాధి నిర్మూలనకు అసమానమైన, అద్భుతమైన మందుగా నిర్ణయింపబడింది. క్షయరోగ నివారణియగు బసోనికోటి నికాసిడ్, హైడ్రాక్సైడ్ మందులను కనుగొన్నారు. బోదకాలు, టైఫాయిడ్, పాండురోగం మున్నగు వ్యాధులకు పూర్తిగా నిర్మూలింపగల మందులను కనుగొన్నాడు.


ఇయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బస్తీలో 1895, జనవరి 12 న జన్మించారు. తండ్రి పేరు జగన్నాథం. ఎలిమెంటరీ, ఉన్నత పాఠశాల చదువులు పూర్తి చేసేటప్పటికి తండ్రి చిరు ఉద్యోగిగానే రిటైర్ అయ్యాడు. ఇక, ఈయనను చదివించడానికి తండ్రి వెనుకంజ వేయగా తల్లి పట్టుబట్టి ఈయనను రాజమండ్రికి పంపించి మెట్రిక్యులేషన్ పరీక్ష చదివించారు. ఫెయిలయ్యారు. ఇంతలో తండ్రి మరణించాడు. తల్లి పట్టుదలతో మద్రాసుకు పంపదల్చగా చేత చిల్లిగవ్వ లేదు. పుస్తెలు అమ్మి కొడుకు చదువుకు ఇచ్చింది.

మద్రాసు హిందూ ఉన్నత పాఠశాలలో చేరి, చదువులో ముందడుగు వేశాడు. పేదరికంలో విద్యాపరమైన నైరాస్యంతో కూడా భవిష్యత్తు పట్ల ఆత్మవిశ్వాసంతో వర్తమాన ఇబ్బందులను అధిగమించే సాహసం ఈయనకు బాల్యంలోనే అబ్బింది. సంఘ సంస్కర్త చిలకమర్తి లక్ష్మీనరసింహం ప్రభావం ఈయన మీద బాగా పొడసూపింది. మద్రాస్, మైలాపూర్ లోని రామకృష్ణ మిషన్ వైపు కూడా ఆకర్షితుడాయ్యారు. వైద్యం నేచి, మిషన్ లో చేరి సన్యాసిగా అందరికీ వైద్య సేవలు అందించాలన్న అలోచన కూడా చేశారు. తన ఆలోచనను వివరింపగా, ససేమిరా అంగీకరించలేదు. బంధువుల సహకారంతో మద్రాసు మెడికల్ కాలేజీ ఇంటర్మీడియట్ డిస్టెంక్షన్ లో పాసయిన ఈయనను చేర్చిందింది. ఈ ఘటన చరిత్ర గతిని మార్చివేసింది.

దేశ స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో విదేశీ దుస్తులను బహిష్కరించి, ఖద్దరు దుస్తులతో కాలేజీకి చెళ్ళీన ఈయన కాలేజీ అధికారుల ఆగ్రహానికి గురయ్యారు. ఇంతలో మరో దుర్ఘటన జరిగింది. అత్యంత సన్నిహితుడైన పెద్దన్నయ్య పురుషోత్తం భయంకరమైన "స్ఫ్రూ" వ్యాధితో మరణించాడు. ఈ బాధ నుండి కోలుకోలేకముందే, వారం రోజుల వ్యవధిలో మరో సోదరుడు కృష్ణమూర్తి కూడా ఇదే వ్యాధికి బలయ్యాడు. ఈ రెండు మరణాలు ఈయనను తీవ్ర మనోవేదనకు గురిచేశాయి. ఎంతటి శ్రమపడి అయినా ఈ వ్యాధికి ముందు కనుగొనాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు.

ఆర్థిక ఒత్తిడి ఎంతగా ఉన్నా, ఎన్ని అవరోధాలు ఎదురైనా చదువు కొనసాగించాలని నిశ్చయించుకున్నాడు. మద్రాసుఇండియన్ మెడికల్ కాలేజీలో ఎల్.ఐ.ఎం. చేసి, కార్పొరేషన్ ఆయుర్వేద హాస్పటల్ లో నెలకు అరవై రూపాయల జీతం మీద పనిచేశాడు. విదేశాలకు వెళ్ళీ పరిశోధనలు చేయాలని వైద్యశాస్త్రాన్ని శోధించి, పరిశోధించి అనేక రహస్యాలను వెలికి తీయానల్ల దృఢ కాంక్షను రోజు రోజుకీ బలపరచుకున్నాడు. ఈ సందర్భంలోనే ఈయన ఆలోచనాశైలి ఇలా ఉంది.

“ఈ ప్రకృతిని శోధించి పరిశీలించే శక్తిని, తనను తాను ఉద్దరించుకునే మేధస్సును మానవుడు అంతరాత్మ ద్వారా సాధించాడు. అయితే విజ్ఞాన శాస్త్ర పరిధిలో అది చాలా చిన్న అడుగు మాత్రమే. సంఘర్షణ, పరిశోధకత్వం మానసిక స్థాయిలోనే జరిగింది. ఈ అంశాన్ని నేను ద్రవస్ఫటికాలను అధ్యయనం చేసినప్పుడు గ్రహించాను. ఇవి ఏకకణ సూక్ష్మ జీవి (అమీబా) భౌతిక ధర్మాలను కలిగి ఉంటాయి. ప్రాణశక్తి మాత్రం గ్రహాంతర రోదసి నుంచి లభించింది. ఈ జీవ శక్తి ఏదో తెలియని కారణాల వల్ల విచిత్రంగా ద్రవస్ఫటికాల తరహా పదార్థాలలో ప్రవేశించి వుంటుందని నా అభిప్రాయం. ప్రకృతి-సృష్టి భ్రమణంలో మనకు తెలియకుండా/అవగాహనకు అందని ఖాళీలను మనం పూరించవలసి ఉంది”

— యల్లాప్రగడ సుబ్బారావు

సుబ్బారావు భావాలలో నైశిత్యము ఉంది. లోతైన పరిశోధనా పటిమా ఉంది. 1925 ప్రాంతంలో ఆయన అతిసార వ్యాధితో శుష్కించిపోయారు. మద్రాసు లోనే ఉన్న ఆనాటి ప్రసిద్ధ ఆయుర్వేద భిషగ్వరులు ఆచంట లక్ష్మీపతి వైద్యం చేసి ప్రాణ రక్షణ చేశారు. ఈ వ్యాధినే ఉష్ణమండల స్ప్రూ వ్యాధిగా నిర్ధారించారు. ఇరువురు సోదరులూ ఈ వ్యాధితోనే మృతి చెందారు. ఆ రోజుల్లో దీనికి సరైన ఔషథం లేదు. రెండు దశబ్దాల అనంతరం దీనికి మందు (ఫోలిక్ ఆసిడ్) కనిపెట్టారు.


Anonymous: 9th
Anonymous: Warangal
Anonymous: Mari meeru
Anonymous: Bye let us stop the chat
Similar questions