India Languages, asked by PadMajxy, 1 year ago

Explain in ur own words about morning or Evening in Telugu Language


kvnmurty: describe in some sentences in telugu script and language

Answers

Answered by sandeeprobo007
1
morning-(suryodhayam)
turpuna suryodhayamayendi
thatamina chekati rathri toligipotundi
surya kiranala nulivachani kanti bhumi meda prasaristundi
vayuvu savadi chestu kamaga padutundi 
e drushyam chuda muchataga untundi.



PadMajxy: but i need some more u gave just few things
sandeeprobo007: what more ??but stll i shall try.
PadMajxy: no need
PadMajxy: igot the answer for tht question
raoatchut191: can u give me that ans
PadMajxy: if u have telugu hindi work book with u open pg no ; 12 in tht book u get the answer
raoatchut191: thanq
PadMajxy: ur welcome
raoatchut191: can i get ur first name
PadMajxy: padmaja
Answered by kvnmurty
1
సాయంత్రం అందరూ చాలా కులాసా గా ఉంటారు. పనులు పూర్తి చేసుకొని హాయిగా గడుపుతారు. పిల్లలు బడి నుంచి తిరిగి వచ్చి టిఫిన్ తిని ఆటలు ఆడదానికి వెళతారు. కొంతమంది పిల్లలు ప్రైవేట్ కి వెళతారు. ఉద్యోగస్తులు ఇంటికి తిరిగి వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకొంటారు. సాయంత్రం సూర్యుడు చల్లగా ఉండి ఎర్రగా పడమటి దిక్కులో కనిపిస్తాడు. కొద్ది సేపటి లోపల అదృశ్యం అయిపొతాడు. అందరూ సంతోషం గా ఉంటారు. ఆడవాళ్ళు రాత్రి కి వంట మొదలు పెడతారు. బ్రాహ్మణులు సంధ్యా వందనం చేసు కుంటారు.

వేసవి లో అయితే పెద్దవాళ్ళు ఆరు బయట చల్ల గాలి వచ్చే చొట కూర్చొని పిల్లలు ఆడుకోవడం చూస్తారు. కొందరు వాళ్లింట్లో మొక్కలకు నీళ్ళు పోస్తారు. చాలా మంది శుభ్రమ్ గా స్నానాలు చేస్తారు. ఇలా అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు.  కొంత మంది గుడి కి వెళ్ళి దేవుడికి పూజలు చేసి ప్రార్ధనలు చేస్తారు.
=====================================================

ఈ సాయం సమయం లో ఎర్రటి సూర్యకిరణాలు భవనాల పై పడి భవనాలన్నీ మెరుస్తున్నాయి. సంధ్యా వెలుగు కిరణాలు నా మీద పడి నా నీడ చాలా పొడుగు గా కనిపిస్తోంది. ఆ అరుణ కాంతి అందరి పై పడి అందరూ ఎర్ర రంగు తో  కనిపిస్తున్నారు.

 ఈ వేళ లో సూర్యుడు భూమి కి సమాంతరంగా ఉండడం తో ఈ సూర్య రశ్మి సూటిగా కళ్ళలోకి పడుతూ ఇబ్బంది పెడుతోంది.

నీలాకాశం అంతా కదులుతున్న రంగు రంగుల మేఘాలతో నిండు గా కళ కళ గా కోలాహాలం గా ఉంది.  గాలి కొద్ది కొద్ది గా చల చల్ల గా చెవులకు తాకుతూ వీస్తోంది. 
దూరంగా ఉన్న సరోవరం పైన పడి ఆ కిరణాలు నీళ్ళని తళతళ మెరీపిస్తున్నాయి. కదులుతున్న కెరటాలు ఆ కాంతి కిరణాలతొ ఆడుతూ ఉంటే చూడడానికి చాలా బాగుంది.

 ప్రకృతి లోని అంద చందాలన్నీ చూస్తూ అలాగే ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండి  పోవాలని ఉంది. ప్రకృతి లో ఒక భాగం అయి పోవాలని అనిపిస్తూంది.



Similar questions