India Languages, asked by laxmisathwik3, 11 months ago

few lines about carpenter in telugu

Answers

Answered by abhishek9313777
7

Answer:

విశ్వకర్మీయుల / విశ్వబ్రాహ్మణుల పంచ వృత్తులలో రెండవ వృత్తి ఈ వడ్రంగము.కలపతో వివిధ వస్తువులను తయారుచేయుట వీరి వృత్తి. వడ్రంగి పని చేయువారు ప్రతి ఊరున ఉంటారు. వీరు ఇళ్ళకు సంబంధించిన తలుపులు, కిటికీలు, ఇళ్ళ పైకప్పులు వంటివి మొదలుకొని ఇంట్లో సామాన్యంగా వాడుకకు ఉపయోగించు చెక్క పరికరములు అన్నీ చేస్తుంటారు. సాంప్రదాయకంగా భారతదేశంలో కూడావిశ్వబ్రాహ్మణులు మాత్రమే తమ కులవృత్తిగా వడ్రంగం చేస్తుండేవారు. ఆధునిక కాలంలో ప్రతి వారూ వడ్రంగం నేర్చుకొని చేయుట మొదలెట్టారు. చేతిలో పనివుంటే దేశంలోఎక్కడికైనా పోయి బతకవచ్చు, కులవృత్తికి ఏదీ సాటిరాదు అని సామెతలు. చెక్క ముడిసరుకుగా ఉన్నప్పుడు వాటికి రూపమిచ్చేది వడ్రంగి. ఇంటి తలుపులు, కిటికీలు, డైనింగ్‌ టేబుల్లు, మంచాలు, వ్యవసాయానికి కావల్సిన నాగలి, కాడి మేడి, బండి,ఇలా ఒకటేంటి అన్నింటినీ వడ్రంగులు చేస్తారు. ప్రస్తుతం వడ్రంగితో పనిచేయించుకుంటే ఆలస్యం అవుతుందని భావించి రెడీమెడ్‌ తలుపులు, డైనింగ్‌ టేబుళ్ళను కొనుగోలు చేయడంతో ఈ రకం చేతి వృత్తులు అంతరించి పోతున్నాయి. అనంతపురం జిల్లాలో వేలాది ముస్లింలు వడ్రంగిపని చేస్తున్నారు. నెల పొడవునా పనిచేసినా కనీసం వెయ్యిరూపాయలు కూడా రాదని వడ్రంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కులవృత్తినే నమ్ముకుని వందలాది మంది తమ గ్రామాలు వదిలి పట్టణాలకు వలస వచ్చారు. చేసే పనికి కూలీ గిట్టుబాటు కాక నేడు వారు నౌకర్లుగా, గుమస్తాలుగా వేరే పనుల్లో పడుతున్నారు.

Answered by SushmitaAhluwalia
1

వడ్రంగి గురించి కొన్ని పంక్తులు

వడ్రంగి అంటే చెక్క ముక్కలను తయారు చేయడం, విక్రయించడం మరియు మరమ్మతులు చేసే వ్యక్తి.

అతను మన సమాజంలో చాలా ఉపయోగకరమైన సభ్యుడు.

ఇది మన ఇళ్లలోని చెక్క వస్తువులను మరమ్మతులు చేసి తయారు చేస్తుంది.

వడ్రంగులు ప్రత్యేక రకాల ఉపకరణాలను కలిగి ఉంటారు, ఈ సాధనాల సహాయంతో వారు కలపను ఉపయోగకరమైనదిగా మార్చగలుగుతారు.

ఎవరైనా కొత్త ఇల్లు కట్టినప్పుడల్లా, ఈ సమయంలో వడ్రంగి పని పెద్ద ఎత్తున జరుగుతుంది.

తలుపులు, ఫ్రేమ్‌లు, కిటికీలు, మంచాలు, కుర్చీలు, బల్లలు మొదలైన వాటిని కొత్త ఇంట్లో వడ్రంగి చేస్తారు.

వడ్రంగి నైపుణ్యం కలిగిన హస్తకళాకారుడు.

వడ్రంగి, కొన్ని పనిముట్లతో, శిల్పి రాయిని చెక్కినట్లు చెక్కి, అందంగా తీర్చిదిద్దుతాడు.

మన దేశంలోని చాలా మంది వడ్రంగులు ఆర్థికంగా బలహీనంగా ఉన్నారు, వారు వడ్రంగి పని చేస్తూ తమ కుటుంబాన్ని నడుపుతున్నారు.

కార్పెంటర్ పని చాలా సృజనాత్మకమైనది, ఇది కలపను ఉపయోగకరమైన వస్తువుగా మారుస్తుంది.

#SPJ2

Similar questions