India Languages, asked by KarthikEYA1986, 9 months ago

Give me a poem on village in telugu.pls.fast. marking as brainliest

Answers

Answered by rs9916948
1

Answer:

పల్లెలంటేనే ఆరబోసిన అందాలు

ఏరులు ఆకుపచ్చని  పొలాలు

కల్మషం లేని తేట మనుషులు

ఏటిగట్టు గా వినిపించే జానపదాలు

తీయగా ఆప్యాయంగా ఉండే పిలుపులు

మనుషుల్లో ఊబికే భక్తి సంప్రదాయాలు

అందరి మనసుల్లో పడతారు కష్టాలు,

ఎదురుపడితే చిందిస్తారు చిరునవ్వులు

కనిపిస్తాయి అమ్మానాన్నపై గౌరవాలు

తేట తేట పల్లె యాస కల్మషం లేని భాష

చిన్ని చిన్ని బడులు సాదా సీదా పంతులు

నెరుస్తారు వానాకాలం చదువులు

పొలాల్లో పనులు రోజూ ఉండవు తిండి గింజలు

నూతిలోంచి తోడుకోవాలి నీళ్ళు

 

=================

 

మా  పల్లెటూరి లో చిన్నచిన్న  రైతులు 

అక్కడక్కడ పచ్చ పచ్చని పొలాలు

బండ్ల  నీడ్చి చిక్కిన  పశువులు

ఇవే మా మనుషుల రాజ శకటాలు 

పైన మండే సూర్యుని ఎర్రటి  ఎండలు

మా ఒంటి నిండా శ్రమ  చెమటలు

కాలి కింద మురికి బురదలు 

పాడి పంటల కోసం పడతాం కష్టాలు

మా ఊరి నిండా ఎన్నో గుడిసెలు

చిరు దీపాలే మాకు వెలుగులు

ఇక చీకటైతే అంతటా పురుగులు

ఈ వేడిమి కి పట్టీ పట్టని నిదురలు 

పండగ కి మేం  వండేది కూర అన్నం

ప్రతి రోజు తినేది ఉప్ప గంజి అన్నం

ఎప్పటికీ మారేనో  మా జీవితం

ఎన్నటికీ తీరోనో మా చిన్ని ఆశలు  

==========================

 

======================

తూరుపున  తెలతెలవారుతోంది  నెమ్మదిగా మసక మసక గా

ఎక్కాను పైమెడ పైకి తొందరగా ఈ ఊరందరినీ  గమనించాలని

చెట్లపై పక్షులు కిలకిల రావాలు చేస్తున్నాయి గోల గోలగా

ప్రజలంతా ప్రొద్దున్నే లేచారు తమ పనులు మొదలుపెట్టగా

ఆడవాళ్ళు ముంగిట ముగ్గులిడుతున్నారు చక్కగా

బిందెలతో వయ్యారంగా వడివడి గా వెళుతున్నారు పంపు చేరాలని

పాపం ఎంతో కష్టపడవలసి వస్తుంది ఈ రోజుల్లోకూడా మంచినీళ్ళకి 

అయినా పడతారు కష్టం వారి వారి కుటుంబాల కోసం

పిల్లలు బయలు దేరారు మాస్టర్ల దగ్గర పాఠాలు నేర్వడానికి

పాపం నిద్ర పూర్తిగా తీరక ఆవులిస్తున్నారు పైపైకి

ఆవుల గేదెల తోలుతున్నారు కాపరులు గడ్డి మేయించడానికి

పూజారుల అర్చనలు  వినిపిస్తున్నాయి  గుడులలోంచి

అగర్బత్తి సువాసన అనుభూతి  కలిగింది మనసులోంచి

అనుకున్నాను స్నానం చేసి తొందరగా పూజ చేసుకోవాలని

మంచి పూవులని కోసి వేశాను నా వెండి బుట్ట లోకి ఇలా ఇలా కాసేపు ...

ఇలాగే  చిన్నచిన్న సామాన్య భావనలతో నిండింది నా మది అనుకొన్నా

  పల్లెటూరు వైభవం పై తీయటి కథ రాయాలని.

Explanation:

please mark as brainliest

Similar questions