Greatness of Telugu language in poems in Telugu
Answers
తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలుపుతూ శ్రీ కృష్ణ దేవరాయలవారు చెప్పిన పద్యం :
తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
యెల్ల నృపులు గొలువ యెఱుగవే బాసాడి
దేశభాషలందు తెలుగు లెస్స.
భావం :
" తెలుగే ఎందుకంటే దేశం ఆంధ్రదేశం, నేను తెలుగువాడినైన రాజును, ఒక తెలుగువాడిని. అలాకాదుగానీ, రాజపూజ్యమైన తెలుగుభాషని మాట్లాడి, తెలుగు లెస్స అని తెలుసుకొనుము! " - శ్రీ కృష్ణ దేవరాయలు
Learn more :
1) Essay writing for telugu day in telugu.
https://brainly.in/question/5351268
2) సమగ్రత తెలుగులో జీవన విధానం
brainly.in/question/13341541
:--
“దేశ భాషలందు తెలుగు లెస్స” అన్నారు శ్రీకృష్ణదేవరాయలు .. అటువంటి భాష మన మాతృభాషా అయినందుకు మనం గర్వపడాలి . మన తెలుగు భాష ఔన్నత్యాన్ని గుర్తుచేసుకుంటూ మన జీవితాల్లో భాగమైన అక్షరం గురించి నా ఈ చిన్న మాట
ఓ అక్షరమా నీకు నమస్కారం…
బాధను పంచుకోవటానికి
ఆనందాన్ని ఆస్వాదించటానికి
కోపాన్ని కరిగించుకోవటానికి
నువ్వే మా ఆధారం
ఓ అక్షరమా ప్రతి సమస్యకు నువ్వే పరిష్కారం
కలలో అయిన
కళలో అయిన
కథలో అయిన
వ్యధలో అయిన
కలలో కథ అయి
కథలో వ్యధ అయి
వ్యధయె పదమై
పదమే స్వరమై
స్వరమే నీ జీవన శైలి అయితే
ఓ అక్షరమా నువ్వే మా జీవన ఆధారం
చేసావు మా జన్మను సాక్షాత్కారం
ఓ అక్షరమా నీకు నమస్కారం
అమ్మతనాన్ని బోధించే అందమైన “అ”కారం
దైవత్వానికి ప్రతిరూపం మన ఓంకారం
అరచేతికి వ్యాయామం మన ” శ్రీ ” అక్షర ఆకారం
మరువ రాదు మాతృభాష పై ఉన్న గౌరవం
పుడమి జడలో పరిమళ పద కుసుమం
విశాల జగత్తులో ప్రశాంత భావ సంద్రం
హరివిల్లెరుగని మనోహర మది వర్ణం
మన హృదయ సంధాన భాషావనం
ఎంత చెప్పిన తరగని భాషా గొప్పతనం మా తెలుగుదనం
ఓ అక్షరమా నువ్వే మా జీవన ఆధారం
చేసావు మా జన్మను సాక్షాత్కారం..!