I need a best Telugu moral story for competition ? 3 to mins for 9th class
Answers
Answer:
ఒక ఊరిచివర పచ్చని మైదానం లో నాలుగు ఆవులు ఎంతో సఖ్యం గా , స్నేహంగా ఉండేవి. కలిసి గడ్డి మేయటం, కలిసి తిరగడం చేసేవి. ఇవి ఎప్పుడూ కలిసి మెలిసి గుంపు గానే ఉండేవి కాబట్టి, పులి, సింహాలు వీటి జోలికి రాలేకపోయేవి.
కొంతకాలానికి, ఎదో విషయంలో వాటిమధ్య దెబ్బలాట జరిగి, నాలుగు ఆవులు నాలుగు వైపులా విడి విడిగా గడ్డి మెయ్యటానికి వెళ్లాయి.
ఇదే సరైన సమయమని, పులి, సింహం పొదల్లో దాక్కుని, ఒకొక్కదాన్ని చంపేశాయి.
నీతి: ఐకమత్యమే బలం....
You are from TS or AP ,Iam from Telangana....
Title:
పిచుక గుణం
Story:
ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయకపు పిచుక వుండేది.
మనసులో ఏ కల్మషంలేని ఆ పిచుకకో ఒక రోజు ఒక కాకుల గుంపు పరిచయం అయ్యింది. ఆ కాకులతో పిచుకకి స్నేహం అయ్యింది.
పిచుకకి అందరూ చెప్పారు – ఆ కాకులతో స్నేహం చేయద్దు, అవి మంచివి కావు, అని. కాని ఆ పిచుక మాట వినలేదు.
ఒక రోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచుకను కూడా తోడు రమ్మన్నాయి. అమాయక పిచుక ఎక్కడకి, ఎందుకు అని అడగకుండా, ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది.
కాకులు ఒక పొలానికి వెళ్లి అక్కడ మొక్కలన్నిటిని ధ్వంసం చేయ సాగాయి. పిచుక నిస్సహాయంగా ఏమి చేయాలో తెలీకా అటూ ఇటూ గెంతుతూ వుంది. ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలెట్టారు. కాకుల గుంపుకు ఇది అలవాటే, అవి తుర్రున ఎగిరిపోయాయి. పిచుక రైతులకు దొరికిపోయింది.
“బాబోయ్! బాబోయ్! నా తప్పేమీ లేదు, నేను అమాయకురాలిని, నేనేమీ చేయలేదు, నన్ను వదిలేయండి!” అని పిచుక ప్రాధేయ పడింది. కాని పంట నాశనం అయిన రైతులు కోపం మీద ఉన్నారు. పిచుక మాట నమ్మలేదు కదా, దాని వైపు అసహ్యంగా చూసి మరో రెండు దెబ్బలు వేసారు.
ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్దారించుకుంటారు. అందుకే మనం మంచి గా వున్న, మన స్నేహితులు చేడువారైతే మనం కూడా చెడ్డ వాళమనే అనుకుంటారు