India Languages, asked by hasyalasya7711, 1 year ago

I want a essay of summer vacation in telugu

Answers

Answered by KomalaLakshmi
69

                                                                                    వేసవి సెలవులు 

          వేసవి సెలవులు........... అదొక మదురాతి మధురమైన బాల్య జ్ఞాపకం.అసలు ....సెలవలకి ముందు ఇన్ని పరిక్షలు ఎందుకు పెడతారోఅని తెగ తిట్టుకుంటాను నేను.బోలెడన్ని రోజు స్కూల్ ఉందని వేసవి సెలవులంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు?పుస్తకాలు ముందేసుకొని కూర్చుంటామ చదువు అసలు బుర్ర కెక్కదు.సెలవుల్లో ఎక్కడికేళ్ళలో ,ఏ మేమి చేయాలో,ఉహించుకోవడం తోనే సరిపోతుంది.ఎగ్జామ్స్ కి చదువు కోమని అమ్మ పొద్దున్నే లేపుతుందేమో,"అబ్బ-ఇంకేన్నిరోజులని సున్నితంగా విసుక్కుంటూ సగం నిద్ర లోనే ఎన్ని రోజులని మల్లి లేక్కపెట్టుకునే వాళ్ళం.తియ్యాతియ్యని మామిడి పాళ్ళు,మల్లెపూలు,నోరూరించే కొత్త ఆవయకాయ ఇవన్ని కలిపితేనే వేసవి సెలవులు. 

       పరిక్షలు అవ్వంగానే .....సూట్కేసులు,బాగుల దుమ్ము దులుపుకొని బట్టలు సర్దుకోవడం తోటే వేసవి సెలవుల అసలు హడావిడి మొదలవుతుంది.ట్రైన్,బస్సు ఎక్కంగానే కిటికీ పక్కన సీట్ కోసం అన్నలు ,అక్కలు,చెల్లలు,తమ్ముళ్ళ పోట్లాటలు.మొత్తానికి తలా కాసేపు అని ఒప్పందం జరుగుతుంది.పాపం అమ్మలందరూ ఎలా భరిస్తారో ఏమో?రైలు ప్రయాణం ఒక అద్భుతం .రాత్రి అవ్వంగానే పై బెర్ట్ మిద పడుకోవడం,పొద్దున్నే లేవడం,దిగినతర్వాట లగేజ్ లెక్కపెట్టుకోవడం,వాటితో పాటు పిల్లలని లెక్కపెట్టడంఆటో,టాక్సీ,  కోసం పరుగులు,కులిల అరుపులు,వారితో బేరాలు,హడావిడే హడావిడిపూర్వం రోజుల్లో సొంతవురికో,అమ్మమ్మ,నానమ్మ,మావయ్యల దగ్గరికో వెళ్లి వాలి పోయేవాళ్ళం.మరిప్పుడు పరిస్తితే వేరు.ఖండాతరాలకి కూడా టురిసం వాళ్ళు ఆన్ని సదుపాయాలతో విహార యాత్రల పేరుతొ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారుమేమైతే రైలు దిగం గానే మా అమ్మమ్మ వాళ్ళింటికి ఆ పల్లెటూరికి బస్సు ఎక్కేవాళ్ళం.దారి పొడుగునా పచ్చటి పంట పొలాలు,కొబ్బరి చెట్లు,తాటి తోపులు మాకు స్వగతం చెప్పేవి.ఆ ఇరుకు మాట్టి రోడ్డు లోంచి వెళ్తుంటే దారిలో కనిపించే వాళ్ళంతా" మీరు ఫలానా వారి మనవరాలు ,మనవళ్ళు కదా"! బాగున్నారా సెలవుల కోస్తున్నారా ?పట్నం లో వుండేది మీరేనా అని గుర్తు పాట్టి ప్రేమగా పలకరించడం కంటే మించిన గొప్ప ఏముంటుంది? 

     మా అమ్మమ్మ వాళ్ళది పెద్ద ఉమ్మడి కుటుంబం.మావయ్యలు,అత్తలు,బావలు,వదినలతో అనురాగ ,ఆప్యాయతలతో  నిండి వుండేదిపెద్ద ఇల్లు .ఇంటి చుట్టూ మొక్కలు,చెట్లు పెద్దబావి.పక్కన వేపచేట్టుకి పెద్ద ఉయ్యాలా.పెద్ద సన్నజాజి పందిరి,మల్లెపూల చెట్లు.ఎన్ని పూలో,కోయలేక ,మాల కట్టలేక మా అమ్మ చేతులు  నొప్పి పుట్టేవి.ఆవులు,గేదలు.వాటి దూడలు,పావురాలు,దొడ్డి నిండా ఎంత సందడో. 

     వేసవి సెలవులంటే మావిడి పళ్ళు ,తాటి ముంజలు,తెగలు,సిమచిన్తకాయలు,.......ఎన్నో.అమ్మమ్మ వండే  పిండి వంటలు,అందరికి కలిపి ఒకే కంచంలో కొత్తావకాయ కలిపి అమ్మమ్మ పెట్టె చద్దన్నం ముద్దలు.కొబ్బరి బూరెలు,కారప్పుస,అరిసెలు,ఇంకా ఎన్నో!చిన్ననాటి స్నేహితులు,వారితో ఆడుకునే ఆటలు.రాత్రిళ్ళు ఆరుబయట పడక,మడత మంచాలు,నవారు మంచాలు,వేసుకొని ఆకాశం వంక చూస్తూ చెప్పుకునే దయ్యాల కధలు, 

     ఇలా రాసుకుంటూ పొతే ఎన్నెన్నో జ్ఞాపకాలు .ఇంతలోనే సెలవులు ఐపోయాయి .పదండి పదందని నాన్న నుండి ఉత్తరాలు,ఫోన్లు,అప్పుడేనా ఇంకా రెండు రోజులని బతిమిలాతలు.మల్లి తర్వాత సంవత్సరం కోసం ఎదురుచూపులు. 

               వేపచెట్టు ఉయ్యాలను గుర్తుతేస్తుంది .వాన చినుకు మట్టి పడవలను గుర్తు తెస్తుంది ,మనసెప్పుడు బాల్యం వైపే పరుగెడుతుంది .అందుకే మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మనసెప్పుడు పసిదే . 

Answered by mangisettymadhavi
57

నేను వేసవి సెలవులుఏపుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటాను,సెలవలు మొదలవడం తోనే హడావిడిగా ఎక్కడైకి వెళ్లాలో ప్లాన్లు వేసుకుంటాము .దాని ప్రకారం ఊర్లన్నీ తిరిగి చివరికి ఇంటికి చేరతాము .ఐతే అందులో ముందుగా అమ్మమ్మ వల్ల ఊరు నానమ్మ వల్ల ఊరికి వెళ్తాము .అక్కడ్నించి ఇంటికి వచ్చి ఎప్పుడూ చూడని ప్రదశాలకి వెళ్లదానికి ప్రయత్నిస్తాము.అలా ఇవన్నీ ఐపొయ్యాక తిరుపతి,షిరిడి లాంటి ప్రదశాలకి వెళ్తాము .ఇలా అన్ని ఊర్లను చూస్తాము .కుదిరితే మా ఇంట్లో కూడా కొంత సమయం గడుపుతాము.

మా ఊరిలో ఉన్న షాపింగ్ మాల్,గుడిలు,పార్కులు చూస్తాము.



అంతే సెలవలు ఇట్టే ఐపోతాయి .

మళ్ళీ పాఠశాలాలూ మొదలవుతాయి.

ఇంకా అప్పట్నుంచి బడి లేదా ఇల్లు ఈ రెడ మా లోకం.

మీరు కూడా మీ సెలవలు ఇలాగ ఎంజాయ్ చేస్తారు కదా.వేసవి సెలవులు కూడా చాలా మొండివి ఒక సారి వెళ్లి పోతే మళ్ళీ రావడానికి సంవత్సరం పడుతుందు.

ఆ డ్యూక్ ఎప్పటి సెలవలు అప్పుడే ఎంజాయ్ చేయాలి. అంతే సంగతులు.

Hope it's help full

Similar questions