I want essay about naa oori andalu (beauty of my village) in telugu
Answers
తూరుపున తెలతెలవారుతోంది నెమ్మదిగా మసక మసక గా ఎక్కాను పైమేడ పైకి తొందరగా ఈ ఊరందరినీ గమనించాలని. చెట్లపై పక్షులు కిలకిల రావాలు చేస్తున్నాయి గోల గోలగా. ప్రజలంతా ప్రొద్దున్నే లేచారు తమ పనులు మొదలుపెట్టగా. ఆడవాళ్ళు ముంగిట ముగ్గులిడుతున్నారు చక్కగా. బిందెలతో వయ్యారంగా వడివడి గా వెళుతున్నారు దూరంగా నీళ్ళ పంపు దగ్గరికి చేరాలని. పాపం ఎంతో కష్టపడవలసి వస్తుంది ఈ రోజుల్లోకూడా మంచినీళ్ళకి అయినా పడతారు కష్టం వారి వారి కుటుంబాల కోసం.
పిల్లలు బయలు దేరారు మాస్టర్ల దగ్గర పాఠాలు నేర్వడానికి. కొంతమంది పాపం నిద్ర పూర్తిగా తీరక ఆవులిస్తున్నారు పైపైకి. వారిని చూస్తే ఎంతో అమాయకంగా ఉన్నారు.
ఆవులను, గేదెలను తోలుకెళ్ళుతున్నారు కాపరులు గడ్డి మేయించడానికి. వారివారి చిత్రమైన శబ్దాలు ఆ పశువులని నియంత్రిస్తున్నాయి. చక్కగా రోడ్డుపైన ఒక ప్రక్కగా వెళుతున్నాయి.
కూరలమ్మేవాళ్లు, కుండలమ్మేవాళ్లు, ఉప్పమ్మేవాళ్లు, దారి వెంట వెళుతూ, కేకలేస్తున్నారు. అపుడపుడు అందమైన కన్నెపిల్లలు పరికిణి , ఓణి, లంగా లేసుకొని చక్కని పసుపుతో మెరుస్తున్న ముఖంతో అటుయిటూ చూస్తూ వెడుతున్నారు. ప్రొద్దుటి చల చల్లని గాలి చెంపలకు తగులుతుంటే, ప్రక్కన ఉన్న వారి స్నేహితులతో ఏవో చలోక్తులు విసురుకుంటూ కళకళగా నవ్వుకుంటూ పోతున్నారు.
పూజారుల అర్చనలు వినిపిస్తున్నాయి గుడులలోంచి. ఈ పల్లెల్లో లౌదుస్పీకర్లు పెడతారు. ప్రొద్దున్నే అందరికీ చక్కగా దైవ సంకీర్తన మంచి లయబద్ధంగా వినిపిస్తుంది. అగర్బత్తి సువాసన అనుభూతి కలిగింది నా మనసులోంచి. అనుకున్నాను స్నానం చేసి తొందరగా పూజ చేసుకోవాలని. మంచి మంచి సువాసనలిస్తున్న పూవులని మా పెరడులోంచి కోశాను. నా వెండి బుట్ట పూర్తిగా నిండలేదు. ఇలా ఇలా
కాసేపు ...
ఇలాగే చిన్నచిన్న సామాన్య భావనలతో
నిండింది నా మది. అనుకొన్నాపల్లెటూరు అందాల వైభవం పై తీయటి కథ రాయాలని. పల్లెటూరే ఒక అందం. అందులోని ప్రకృతి ఒక విధం గా , ప్రజలు మరోవిధం గా మన మనసుని ఆహ్లాదపరుస్తారు. ఇంతకన్నా ఇంకేం అందం కావాలి, మన మనసుని రంజింప చేయడానికి?
=====
ఇవే పల్లెలందాలు.....
పల్లెలంటేనే ఆరబోసిన అందాలు
ఏరులు ఆకుపచ్చని పొలాలు
కల్మషం లేని తేట మనుషులు
ఏటిగట్టు గా వినిపించే జానపదాలు
తీయగా ఆప్యాయంగా ఉండే పిలుపులు
మనుషుల్లో ఊబికే భక్తి సంప్రదాయాలు
అందరి మనసుల్లో పడతారు కష్టాలు,
ఎదురుపడితే చిందిస్తారు చిరునవ్వులు
కనిపిస్తాయి అమ్మానాన్నపై గౌరవాలు
తేట తేట పల్లె యాస కల్మషం లేని భాష
చిన్ని చిన్ని బడులు సాదా సీదా పంతులు