History, asked by mwrs1987, 1 year ago

Importance of charminar in telugu


Answers

Answered by Anonymous
2
hey mate here's ur answer


charminar hydrabad lo undi aakada nalugu peda peda godalu katti unnai danine manam charminar antam...



hope it wll help you
#be brainly
Answered by NishitaNishu
4
చార్మినార్‌లోని 'చార్‌'ల అద్భుతం. Charminar history నాలుగువందల సంవత్సరాల చరిత్ర కలిగిన చార్మినార్‌కు 'చార్‌'తో విడదీయరాని సంబంధం ఉంది. నాలుగు మీనార్‌లతో నిర్మితమై ఉంది. కనుక దీనికి చార్మినార్‌ అని పేరు వచ్చిందనేది అందరికీ తెలిసిందే. కానీ చార్మినార్‌ నిర్మాణంలో అడుగడునా 'నాలుగు' దాగి ఉందనేది అందరకీ తెలియని అద్భుతం.

ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా ఖ్యాతి గాంచిన చార్మినార్‌లోని చార్‌కు చాలా ప్రత్యేకత ఉంది. ప్రతి కోణంలోను 'నాలుగు' ప్రతిబింబించేలా నిర్మించిన చార్మినార్‌ అప్పటి నిర్మాణ చాతుర్యానికి, కళా నైపుణ్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. కేవలం నాలుగు మినార్‌ల కారణంగానే చార్మినార్‌కు ఆ పేరు స్థిరపడలేదు. ఆర్కియాలజీ అండ్‌ మ్యూజియం శాఖ పరిశోధనలలో ఈ కట్టడానికి ఆ పేరు పెట్టటానికి దారి తీసిన అనేక కారణాలు వెలుగు చూశాయి. చార్మినార్‌కి ఆ పేరుపెట్టడానికి మరో 20 రకాల కారణాలున్నాయంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. చార్మినార్‌కు నలువైపులా ఉన్న 40 ముఖాల కొలతలు నాలుగుతో భాగించే విధంగా నిర్మించారు. ఇది అద్భుతమైన నిర్మాణ శైలికి దర్పణంగా నిలుస్తుంది. అలాగే నాలుగు మినార్‌ల ఎత్తు కూడా 60 గజాలు. వీటిని కూడా నాలుగుతో భాగించవచ్చు. ఈ చారిత్రాత్మక కట్టడం నాలుగు రోడ్ల కూడలిలో గస్తీ తిరిగే సైనికునిలా ఉంటుంది. భారతదేశంలో అతి తక్కువ స్థలంలో నిర్మించిన చారిత్రక కట్టడాలలో చార్మినార్‌ ఒకటి. చార్మినార్‌ నిర్మాణం చేపట్టిన మొత్తం స్థలం విస్తీర్ణం 840 చదరపు గజాలు. ప్రతి మినార్‌లోను నాలుగు గ్యాలరీలు ఉన్నాయి. మొదటి రెండు గ్యాలరీలలో 20 ఆర్చిలు ఉన్నాయి. 3,4 గ్యాలరీల్లో 12 ఆర్చిలు ఉన్నాయి. ఈ ఆర్చ్‌ల మొత్తాన్ని కలిపితే వచ్చే 44ని కూడా నాలుగుతో భాగించవచ్చు. అంతేకాక చార్మినార్‌ లోని ప్రతి కొలతలో కూడా నాలుగు కనిపిస్తుంది. ఆర్చ్‌ల రూపకల్పనలోనూ, మెట్ల నిర్మాణంలోను కూడా నాలుగు దర్శనమిస్తుంది. రెండో అంతస్తుకు నాలుగో ఆర్చ్‌కు నాలుగు వైపులా నాలుగు గడియారాలు ఉన్నాయి. ప్రతి మినార్‌ లోని బాల్కనీల శిల్పాలు పెట్టేందుకు వీలుగా 44 ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఈ కట్టదడానికి గల విశాలమైన ఆర్చ్‌లకి ఇరువైపులా పైన పేర్కొన్న విధంగా నాలుగు ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇటువంటి స్థలాలు మొత్తం 32 ఉన్నాయి. మొదటి అంతస్తులో ఆర్చ్‌లకి, మినార్‌లకి మధ్య చతురస్రాకారంలో 16 గజాల చుట్టుకొలతలతో ఒక నీటి కొలను ఉంది. ప్రతి మినార్‌కి మధ్య స్థలం 28 గజాలు ఉంటుంది. ఆర్చ్‌లకి, మినార్‌లకి మధ్య గల చతురస్రాకారపు ఖాళీ స్థలం కొలత 12 గజాలు. చార్మినార్‌కి నాలుగు వైపులా 48 చదరపు గజాల స్థలాన్ని కేవలం ఆర్చ్‌ల నిర్మాణం కోసం వదిలేశారు. కట్టడం పైకి వెళ్లటానికి ప్రతి మినార్‌లోను మెట్లు ఉన్నాయి. ఆ మెట్లను చేరుకోవటానికి నాలుగు ఆర్చ్‌లు ఉన్నాయి. ప్రతి మినార్‌లోను 140 మెట్లున్నాయి. ప్రతి మినార్‌ అందమైన డోమ్‌ ఆకారంలో ఉంటుంది. చార్మినార్‌ ఆర్చ్‌ల బయటి వైపు కొలతలు 28గజాలు. మినార్‌ల ఎత్తు 32 గజాలు. మెదటి, రెండవ అంతస్తలలో 16 చిన్న, పెద్ద ఆర్చ్‌లు ఇరువైపులా ఉన్నాయి. మూడవ అంతస్తులో 16 ఆర్చ్‌లు ఉన్నాయి. ఎంతో అందమైన పనితనంతో జాలీ నిర్మించారు. ఈ అంతస్తులో ఒక చిన్న మసీదు ఉంది. నమాజు చేసుకోవటానికి వీలుంది. ఈ మసీదుకు కూడా నాలుగు మినార్‌లు ఉన్నాయి. ఇన్ని ఆసక్తికరమైన అంశాలు చార్మినార్‌ కట్టడంలో దాగి ఉన్నాయి. ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా ఎన్ని నాలుగులు కలిపితే చార్మినార్‌ రూపొందిందో!

చార్మినార్చార్-మీనార్ అనగా నాలుగు మీనార్లు కలిగిన ఓ కట్టడము. ఇది హైదరాబాదులో ఉన్న ప్రాచీన చారిత్రక కట్టడాలలో ఒకటి. ఇది హైదరాబాదు పాత బస్తీలో ఉంది. ఈ చారిత్రక కట్టడం యొక్క ప్రఖ్యాతి వలన దీని చుట్టు ఉన్న ప్రాంతానికి చార్మినార్ ప్రాంతముగా గుర్తింపు వచ్చింది. దీనికి ఈశాన్యములో లాడ్ బజార్ మరియు పడమరన గ్రానైటుతో చక్కగా నిర్మించబడిన మక్కా మస్జిద్ ఉన్నాయి.

I hope the answer is clear..

Pls mark me as brainlist....
Similar questions