India Languages, asked by ojasvisood8049, 1 year ago

importance of cheruvu in telugu

Answers

Answered by Royal213warrior
82
హైదరాబాద్ లో ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఉన్న దుర్గం చెరువు మంచి నీటి సరస్సు. జూబ్లీ హిల్స్ మరియు మాదాపూర్ ప్రాంతానికి మధ్యలో దాగి ఉండడం వల్ల ఈ సరస్సు ని రహస్యపు సరస్సుగా కూడా పిలుస్తారు. హైదరాబాద్ ప్రజలలోఈ సరస్సుకి అత్యంత చారిత్రక ప్రాముఖ్యత కలిగినది. ఖుతుబ్ షా సామ్రాజ్యంలో, గోల్కొండ కోటలో ఇంకా కోట సమీపంలో ఉన్న ప్రజలకి మంచి నీటి సదుపాయం ఈ సరస్సు కల్పించింది.

రైతులు వ్యవసాయంలో నీటి పారుదల కోసం ఈ సరస్సుని ఉపయోగించేవారు. ప్రధాన పర్యాటక ఆకర్షణ గా ఈ సరస్సుని తయారు చెయ్యడం కోసం 2001 లో రాష్ట్ర ప్రభుత్వం ఈ సరస్సుని అభివృద్ధి చెయ్యాలని నిర్ణయించింది. కొద్ది కాలం లో నే ఈ సరస్సు ఏంతో ప్రాచుర్యం పొందింది. ఇక్కడ చేపలు పట్టేందుకు అనువుగా ఉంటుంది. ఎంతో మంది సరదాగా చేపలు పట్టడం కోసం ఇక్కడికి వస్తారు.

ఈ ప్రాంతాన్ని ప్రధాన పర్యాటక ఆకర్షణగా మలిచేందుకు వెలుగులు, రాక్ గార్డెన్, ఫ్లోటింగ్ ఫౌంటెన్ అలాగే కృతిమ జలపాతాల వంటి ఎన్నో ఆకర్షణలని ఇక్కడ జోడించారు. ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ ఇంకా రాపెల్లింగ్ వంటి వివిధ వినోద కార్యక్రమాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి.
Answered by saisridatha
6

Answer:

చెరువునకు నీరెక్కువైనపుడు ఆ నీరు పోవుట కేర్పరచినదారిని అలుగు అంటారు. అలుగును కాంక్రీట్ తో నిర్మించడం వలన నీటి ప్రవాహంను తట్టుకోన గలుగుతుంది. సాధారణంగా చెరువు కట్టలను మట్టి, రాళ్లను ఉపయోగించి నిర్మిస్తారు. మట్టితో నిర్మితమైన చెరువు కట్టలు ఒక్కొక్కసారి చెరువు నిండి నీటి ప్రవాహానికి గురైనపుడు చెరువు కట్ట కోతకు గురై గండ్లు ఏర్పడతాయి. చెరువుకు గండ్లు ఏర్పడుట వలన అందు నుంచి ప్రవహించే నీరు ఒక్కసారిగా పంట పొలాలపై, రోడ్లపై ప్రవహించటం వలన ఆస్తి నష్టం జరగటమే కాకుండా ఒక్కొక్కసారి ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంది. ఈ నష్టం జరగకుండా చెరువు నిండి నపుడు భూమి కోతకు గురికాకుండా నిదానంగా ఇక్కడ మిగిలిన నీరు మరొక అవసరమైన చోటుకు అనగా ఈ చెరువుకు దిగువ భాగాన ఉన్న ఇతర చెరువులకు ఈ నీటిని సురక్షితమైన మార్గంలో చేరవేసేందుకు ఏర్పరుచుకున్నవే ఈ అలుగులు. సాధారణంగా అలుగు నిర్మాణం చెరువు కట్ట చివరి భాగాన నిర్మిస్తారు. అధిక వర్షం కురిసినపుడు చెరువు లోనికి నీరు వేగంగా వస్తుంది. చెరువు నిండి నపుడు చెరువు కట్ట పై భాగానికి నీరు చేరినట్లయితే చెరువు కట్ట సులభంగా తెగుతుంది. చెరువు నిండి నపుడు అధికంగా వచ్చే నీరు చెరువు కట్ట కంటే తక్కువ ఎత్తులో నిర్మించిన అలుగు ద్వారా ప్రవహించుట వలన చెరువు కట్టకు ఎటువంటి ప్రమాదం ఉండదు. చెరువుకు వచ్చే అధిక నీటి ప్రవాహాన్ని బట్టి అలుగును హెచ్చు తగ్గులుగా కూడా నిర్మిస్తారు. చెరువు నిండి తక్కువ మొత్తంలో చెరువుకు అధిక నీరు వస్తున్నపుడు అలుగు తక్కువ స్థాయి ఎత్తులో నిర్మించిన వైపు నుండి ప్రవహిస్తుంది. అలాగే ఎక్కువ మొత్తంలో చెరువుకు అధిక నీరు వస్తున్నపుడు అలుగు తక్కువ స్థాయి ఎత్తులో నిర్మించిన వైపుతో పాటు ఎక్కువ స్థాయి ఎత్తులో నిర్మించిన వైపు కూడా నీరు ప్రవహిస్తుంది. అలుగులు ముందు జాగ్రత్త కొరకు నిర్మించినవి, వర్షాలు పడిన ప్రతిసారి అలుగులు పారవు, ఒక్కొక్కసారి కొన్ని సంవత్సరాల పాటు కూడా అలుగులు పారవు. అలుగులు నిర్మించినప్పటికి, కొన్నిసార్లు భారీ వర్షాలు పడినపుడు చెరువు కట్టలోని లోపాల వలన లేదా అలుగు సామర్థ్యానికి మించి నీరు చెరువుకు చెరువుకు చేరుట వలన చెరువు కట్టలు తెగి గండ్లు ఏర్పడతాయి.

Explanation:

Similar questions