India Languages, asked by saraswathi7, 1 year ago

నీవు జరుపుకున్న పండుగను గురించి మీ మిత్రురాలికి లేఖ రాయండి.(in telugu)​

Answers

Answered by suggulachandravarshi
7

Answer:

విజయవాడ,

28-07-20.

ప్రియమైన మిత్రురాలు సంజనకి వర్షిణి రాయునది ఏమనగా,

ప్రియమైన సంజన,

నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగానే ఉన్నావ్ అని నేను ఆశిస్తున్నాను.నీకు నేను చాలా రోజుల తర్వాత ఉత్తరం రాస్తున్నాను కదా..! ఇంతకీ నేను ఈ ఉత్తరం ఎందుకు రాస్తున్నానంటే.... మొన్నామధ్య మనకు దీపావళి పండగ వచ్చింది.. అది నాకు ఒక చిరస్మరణీయ రోజు.. నేను ఈ ఉత్తరం నీకు దీపావళి గురించి, దీపావళి అంటే ఏంటో తెలపడానికి రాస్తున్నాను..

భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది. చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా జరుపుకుంటారు.

చిరునామా:

సంజన,

d/o నారాయణ రావు,

హుడా కాలనీ, రాజీవ్ నగర్,

విజయవాడ - 520015

ఆంధ్ర ప్రదేశ్.

నేను కూడా తెలుగునే...

ఈ సమాధానం నీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను...

Similar questions