Hindi, asked by kmd48090, 7 months ago

kulamun rajyamun poem bhavam​

Answers

Answered by vasanthaallangi40
21

\bold\red{నమస్కారం}

ఇది తెలుగు ప్రశ్న . తెలుగు, ఒక భారతదేశపు భాష . అందుకని Indian Languages అనే వర్గం లో పోస్టు చేయండి .

ఇది, పోతన గారి భాగవతం నుండి తీసుకోబడిన పద్యం .

పద్యం

కులమున్ రాజ్యము తేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంభరం

డలతిం బ్రోడు త్రివిక్రమస్ఫురణ వాఁడై నిండు బ్రహ్మాండముం;

గలఁడే మాన్ప నొకండు? నా పలుకు లాకర్ణింపు కర్ణంబులన్;

వలదీ దానము గీనముం బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా!

భావం

" దాతలలోకెల్లా అగ్రేశ్వరుడా! బలీ! ఈ పొట్టివాడు సాక్షాత్తు విశ్వభర్త, విష్ణువు. అంత తేలికగా ఇతను ఇక్కడ నుండి వెళ్ళడు. మూడు లోకాలనూ, మూడు అడుగులుగా కొలిచే త్రివిక్రమ రూపం ధరించి, బ్రహ్మాండం అంతా నిండిపోతాడు. అప్పుడు అతనిని ఎవ్వరూ ఆపలేరు తెలుసా. దానం వద్దు, గీనం వద్దు. ఈ బ్రహ్మచారిని పంపిచెయ్యి. నీ కులాన్నీ, రాజ్యాన్నీ, పరాక్రమాన్నీ నిలబెట్టుకో "

Answered by lspfdnr
2

Explanation:

kulamun rajyamun poem nd bhavam

Attachments:
Similar questions