వలస కూలీలు వారి కష్టాలు
minimum 10 points .please spam cheyyodu
Answers
Answer:
అలా పని కోసం నగరాలకు వసల వచ్చిన వారు భవన నిర్మాణ కార్మికులుగా, పారిశుద్ధ్య కార్మికులుగా, హోటర్ కార్మికులుగా, మెకానిక్‌లుగా, షాపు కార్మికులుగా, తోపుడు బండ్లపై, ప్లాట్‌ఫామ్‌లపై చిరువ్యాపారస్తులుగా, హమాలీలుగా, రవాణా కార్మికులుగా, ఇండ్లలో పనిచేసేవారిగా, సెక్యూరిటీ గార్డులుగా చెత్త ఏరుకుని అమ్మి కొత్త సరుకు ఉత్పత్తికి తోడ్పాటునిస్తూ దుర్గంధ కాలుష్య కోరల్లో చిక్కుకుని సామాన్య మానవుడి అవసరాలుతీర్చే వాళ్ళుగా మారారు. వీరిలో ఎంతో మంది కుటుంబం గడవడం కోసం తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతున్నారు.
చట్టం వచ్చినా...
ఎలాంటి అభివృద్ధికీ నోచుకోని ఇలాంటి అసంఘటిత కార్మికులు వేలల్లో ఉన్నారు. కాని ఈ కార్మికుల గురించి మన ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. వీరిలో ఏ ఒక్కరికీ పనిగ్యారెంటీ కల్పించడం లేదు. వీరి సంక్షేమం కోసం వామపక్ష పార్టీలు పోరాడితే అసంఘటిత కార్మిక చట్టం 1996లో దేవేంద్రగౌడ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆయా రాష్ట్రాల పరిస్థితులకనుగుణంగా ఈ చట్టాన్ని అమలు చేయాలని రాష్ట్రాలకు అప్పజెప్పింది.
పట్టించుకునే వారు లేరు
కార్మికులకు పనిగ్యారెంటీ. అసంఘటిత కార్మికులకు కనీసవేతనం ఇవ్వాలి. ఈ కార్మికులకు ప్రభుత్వమే ఇండ్లు నిర్మించాలి. కార్మిక గుర్తింపుకార్డులు ఇవ్వాలి. ఇ.ఎస్.ఐ, పి.ఎఫ్ సౌకర్యం కల్పించాలి. 60 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలి. 34 రకాల పనులుచేసే అసంఘటిత రంగాలకు విడివిడిగా సంక్షేమబోర్డులు ఏర్పాటు చేయాలి. ఇలా చట్టంలో ఎన్నో విషయాలు పొందుపర్చారు. మన పక్కన ఉన్న తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో ఇందులోని కొన్ని అమలవుతున్నాయి. అలాగే కేరళ, త్రిపురలో 34 రంగాలకు విడి విడిగా బోర్డులను సైతం ఏర్పాటు చేశారు. 60 సంవత్సరాలు దాటిన వారికి వెయ్యి రూపాయలు పెన్షన్ కూడా ఇస్తున్నారు. కాని తెలుగు రాష్ట్రాల్లో ఈ చట్టం గురించి, అసంఘటిత కార్మికుల గురించి పట్టించుకునే నాథుడులేడు.
edi mi answer. stay home and stay safe andi