India Languages, asked by siddireddygarijaipal, 4 months ago

పాండవులు 'ఉదారస్వాభావులు' సామర్డిసు రాయoడి​

Answers

Answered by govardhanagirise76
1

Explanation:

పాండురాజు కుమారులు. వీరు అయిదుగురు- 1. ధర్మరాజు 2. భీమసేనుడు 3. అర్జునుడు 4. నకులుడు 5. సహదేవుడు. ఇందు మొదటి మువ్వురును కుంతి కొడుకులు కావున కౌంతేయులు అని కడపటి ఇరువురును మాద్రి కొడుకులు కనుక మాద్రేయులు అనియు చెప్పఁబడుదురు. వీరు పాండురాజు మృతి చెందిన పిదప హస్తినాపురియందు ధృతరాష్ట్రుని వద్ద పెరుగుచు ధనుర్వేదాది విద్యలయందు మహానిపుణులు అయి ఉండఁగా వీరిమేలిమిచూచి ధృతరాష్ట్రుని పెద్దకొడుకు అయిన దుర్యోధనుడు ఓర్వచాలక, శకుని కర్ణదుశ్శాసనులతో కూడుకొని అనవరతము వీరలకు హింసకావించుచు ఉండెను. అది ఎట్లనిన ఒకనాడు దుర్యోధనుఁడు భీముడు నిద్రపోవుచు ఉండుతఱిని అతనిని లావుత్రాళ్లతో కట్టి గంగమడువునందు త్రోయించెను. మఱియొకనాడు అతని సర్వాంగములందును కృష్ణసర్పములను పట్టి కఱపించెను. ఇంకొకనాడు భోజన సమయమునందు వానికి విషము పెట్టించెను. అతడు అనంతసత్వుడును దివ్యపురుషుడును కాన అవియెల్ల అతనిని చంపనేరవయ్యెను. మఱియు దుర్యోధనుడు పాండవులకు అందఱకును అపాయముచేయ సమకట్టి వారణావతమునందు లక్కయిల్లు ఒకటి కట్టించి అందు పాండవులను చేర్చి దానికి నిప్పు పెట్టి వారిని దహించ తలపెట్టెను. వారు ఈవృత్తాంతమును విదురుని మూలముగ ఎఱగి అచటి నుండి తప్పించుకొనిపోయి జననీ సహితముగ విప్రవేషధారులు అయి ఏకచక్రాపురమందు కొంతకాలము ఉండి అనంతరము ద్రుపదరాజుపట్టణమునకు పోయి అచట అర్జునుఁడు ద్రౌపదీస్వయంవరమున మత్స్య యంత్రమును అశ్రమమున ఉరలనేసి సకలరాజ లోకంబును ఓడించి ద్రౌపదిని చేకొని గురువచనమున ఆమెను ఏవురును వివాహము చేసుకొనిరి. అంత ఆవృత్తాంతము అంతయు ధృతరాష్ట్రుడు ఎఱిగి పాండవులను రావించి వారికి అర్ధరాజ్యము ఇచ్చి ఇంద్రప్రస్థపురమున ఉండ మనెను. వారి రాజ్యవిభూతియు గుణసంపదయు చూచి దుర్యోధనుఁడు ఓర్వ చాలక శకుని సహాయమున మాయజూదము ఆడి ధర్మరాజును పరాజితుని చేసి పండ్రెండు ఏండ్లు వనవాసమును ఒక యేడు జనపదమున అజ్ఞాతవాసమును చేయునట్లుగా నిర్ణయించిరి. అట్లు పాండవులు వనవాసముచేసి సమయము తప్పక అజ్ఞాత వాసమును జరపి మరలివచ్చి తమరాజ్య భాగమును అడిగిన ఈయక దుర్యోధనుడు వారలతో విరోధించి ఎదిరించి యుద్ధము చేసి మడిసెను. పాండవులును శత్రువులను చంపి రాజ్యమును మరలకైకొని అశ్వమేధాదియాగములచే జనులకు హర్షము కావించుచు ఉండి కృష్ణనిర్యాణానంతరము పరీక్షిత్తునకు రాజ్యాభిషేకము చేసి స్వర్గారోహణము కావించిరి.

Similar questions