India Languages, asked by itzHitman, 5 months ago

గ్రంధాలయాలు గురించి వ్యాసం రాయండి .

Oyy others who don't know don't answer it..​

Answers

Answered by Anonymous
15

Answer:

ప్రజల ఉపయోగార్ధం అన్నిరకముల పుస్తకాలను ఒకేచోట చేర్చి పరిరక్షించు ప్రదేశాన్ని గ్రంథాలయం అని అంటారు.తెలుగులో గ్రంథాలయాల కొరకు అయ్యంకి వెంకట రమణయ్య ఉద్యమం నడిపి, దానిని వ్యాప్తి చేసి, గ్రంథాలయ పితామహుడుగా అనే పేరు పొందాడు.అతని తదనంతరం ఉద్యమాన్ని ఉధృతి చేసి వ్యాప్తి చేసిన క్రియాశీలి వెలగా వెంకటప్పయ్య.

అత్యంత ప్రాచీనమైన గ్రంథాలయాల్లో అసుర్‌బనిపాల్ గ్రంథాలయం ముఖ్యమైంది. క్రీ.పూ.668-627ల మధ్యకాలంలో అస్సీరియన్ సామ్రాజ్యాన్ని ఏలిన అసుర్‌బనిపాల్ ఈ గ్రంథాలయాన్ని నిర్మించారు. అసుర్‌బనిపాల్ కాలంలో అతని సామ్రాజ్యం గొప్ప వైభవంతో విలసిల్లింది. విజ్ఞాన సముపార్జన, సంరక్షణ చేయాలనే దృక్పథం క్రియారూపంలోకి తెచ్చేందుకు తన సామ్రాజ్యంలోని నినెవ్ అనే ప్రాంతం (నేటి ఉత్తర ఇరాక్‌) లో గ్రంథాలయం నిర్మించారు. చిత్రలిపిలో రాయబడే మట్టిపలకల రూపంలో గ్రంథాలు ఉండేవి.మతం, రాజ్యపరిపాలన, విజ్ఞానం, కవిత్వం, వైద్యం, పౌరాణికగాథలు వంటివి ఆయా గ్రంథాల్లో రచించారు. అటువంటి వేలాది మట్టిపలకల గ్రంథాలను ఈ గ్రంథాలయంలో భద్రపరిచారు. ఈ గ్రంథాల్లో నాల్గు వేలయేళ్ల పూర్వపుదైన గిల్‌గమేష్ అనే సుమేరియన్ ఇతిహాసం ప్రతి కూడా ఈ గ్రంథాలయంలో ఉంది.అసుర్‌బనిపాల్ రాజ్యానంతరం కొన్ని శతాబ్దాల తరబడి నిలిచిన ఈ గ్రంథాలయం కాలక్రమంలో వేలయేళ్లకు శిథిలమైపోయింది.

Explanation:

Hope this may help you....

TQ FOR UR THANKS ☺️☺️

Answered by Anonymous
7

Answer:

ప్రజల ఉపయోగార్ధం అన్నిరకముల పుస్తకాలను ఒకేచోట చేర్చి పరిరక్షించు ప్రదేశాన్ని గ్రంథాలయం అని అంటారు.తెలుగులో గ్రంథాలయాల కొరకు అయ్యంకి వెంకట రమణయ్య ఉద్యమం నడిపి, దానిని వ్యాప్తి చేసి, గ్రంథాలయ పితామహుడుగా అనే పేరు పొందాడు.అతని తదనంతరం ఉద్యమాన్ని ఉధృతి చేసి వ్యాప్తి చేసిన క్రియాశీలి వెలగా వెంకటప్పయ్య.

Similar questions