Please say telugu poems in telugu
Answers
శ్రీలు పొంగిన జీవ గడ్డై
పాలు పారిన భాగ్యసీమై
శ్రీలు పొంగిన జీవ గడ్డై
పాలు పారిన భాగ్యసీమై
రాలినది ఈ భరత ఖండము
భక్తి పాడర తమ్ముడా
రాలినది ఈ భరత ఖండము
భక్తి పాడర తమ్ముడా
శ్రీలు పొంగిన జీవ గడ్డై
పాలు పారిన భాగ్యసీమై
చరణం:1
దేశ గర్వము కీర్తి చెందగ
దేశ చరితము తేజరిల్లగ
దేశం మరచిన ధీర పురుషుల
తెలిసి పాడర తమ్ముడా
దేశం మరచిన ధీర పురుషుల
తెలిసి పాడర తమ్ముడా
శ్రీలు పొంగిన జీవ గడ్డై
పాలు పారిన భాగ్యసీమై
రాలినది ఈ భరత ఖండము
భక్తి పాడర తమ్ముడా
రాలినది ఈ భరత ఖండము
భక్తి పాడర తమ్ముడా
2.
Answer:
1)చంపగూడదెట్టి జంతువునైనను
చంపవలయు లోక శత్రుగణము
తేలుకొండిగొట్టందే లేమి చేయురా
విశ్వదాభిరామ వినురవేమ!
2)ఆత్మశుద్ధి లేని అచారమది ఏల
భాండశుద్ధి లేని పాకమేల
చిత్తశుద్ది లేని శివ పూజలేలర
విశ్వధాభిరామ, వినుర వేమ
3)ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా
నలుపు నలుపే గాని తెలుపు కాదు
కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకునా
విశ్వధాభిరామ, వినుర వేమ
4)ఆనగననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వధాభిరామ, వినుర వేమ
5)కనక మృగము భువిని కలదు లేదనకను
తరుణి వీడి చనియె దాశరధుడు
బుద్ధిలేనివాడు దేవుడెట్లాయెరా?
విశ్వధాభిరామ, వినుర వేమ
6)ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా
నలుపు నలుపే గాని తెలుపు కాదు
కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకునా
విశ్వధాభిరామ, వినుర వేమ
7)మేడి పండు చూడ మేలిమైయుండు
పొట్ట విప్పి చూడ పురుగులుండు
పిరికి వాని మదిని బింకమీలాగురా
విశ్వధాభిరామ, వినుర వేమ
8)ఇనుము విరిగెనేని ఇరుమారు ముమ్మారు
కాచి యతకవచ్చు క్రమము గాను
మనసు విరిగెనేని మరి చేర్చరాదయ
విశ్వధాభిరామ, వినుర వేమ
9)చెప్పులోన రాయి చెవిలోన జోరీగ
కంటిలొన నలుసు కాలి ముల్లు
ఇంటిలోన పోరు ఇంతింత గాదయ
విశ్వధాభిరామ, వినుర వేమ
10)తప్పులెన్నువారు తండోపతండంబు
లుర్వి జనులకెల్ల నుండు తప్పు
తప్పు లెన్నువారు తమతప్పు లెరుగరు
విశ్వధాభిరామ, వినుర వేమ
pls mark me as brainliest