India Languages, asked by kimBaneetavan, 1 year ago


Poem on nature in village in telugu

Answers

Answered by kvnmurty
22
తూరుపున  తెలతెలవారుతోంది  నెమ్మదిగా మసక మసక గా
ఎక్కాను పైమెడ పైకి తొందరగా ఈ ఊరందరినీ  గమనించాలని
చెట్లపై పక్షులు కిలకిల రావాలు చేస్తున్నాయి గోల గోలగా
ప్రజలంతా ప్రొద్దున్నే లేచారు తమ పనులు మొదలుపెట్టగా
ఆడవాళ్ళు ముంగిట ముగ్గులిడుతున్నారు చక్కగా
బిందెలతో వయ్యారంగా వడివడి గా వెళుతున్నారు పంపు చేరాలని
పాపం ఎంతో కష్టపడవలసి వస్తుంది ఈ రోజుల్లోకూడా మంచినీళ్ళకి 
అయినా పడతారు కష్టం వారి వారి కుటుంబాల కోసం
పిల్లలు బయలు దేరారు మాస్టర్ల దగ్గర పాఠాలు నేర్వడానికి
పాపం నిద్ర పూర్తిగా తీరక ఆవులిస్తున్నారు పైపైకి
ఆవుల గేదెల తోలుతున్నారు కాపరులు గడ్డి మేయించడానికి
పూజారుల అర్చనలు  వినిపిస్తున్నాయి  గుడులలోంచి
అగర్బత్తి సువాసన అనుభూతి  కలిగింది మనసులోంచి
అనుకున్నాను స్నానం చేసి తొందరగా పూజ చేసుకోవాలని
మంచి పూవులని కోసి వేశాను నా వెండి బుట్ట లోకి ఇలా ఇలా కాసేపు ...
ఇలాగే  చిన్నచిన్న సామాన్య భావనలతో నిండింది నా మది అనుకొన్నా
 
పల్లెటూరు వైభవం పై తీయటి కథ రాయాలని .
Similar questions