Short essay on swatch Bharath in Telugu
Answers
మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని వచ్చే ఐదేళ్లలో సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా గురువారం 2 అక్టోబర్ 2014 ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. 24 సెప్టెంబర్ 2014న భారత కేంద్ర కేబినెట్, పట్టణప్రాంతాలలో స్వచ్చ భారత్ మిషన్ కు ఆమోదం తెలిపింది. ఈ మిషన్ అక్టోబర్ 2, 2014నుంచి ప్రారంభమై ఐదేళ్ళ పాటు అమలు చేయబడుతుంది.
ఈ మిషన్ దేశంలోని 4041 పైగా చట్టబద్ధమైన పట్టణాల్లో అమలు చేయబడుతుంది మరియు 62009 కోట్లరూపాయల ఖర్చులో 14623 కోట్లరూపాయలు కేంద్ర ప్రభుత్వం భరించనుంది.
ఈ మిషన్ స్వచ్చ భారత్ అభియాన్ లో పట్టణ విభాగంగా ఉండి పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ద్వారా అమలు చేయబడనుంది. అయితే, దీని గ్రామీణ విభాగం మాత్రం కేంద్ర తాగునీరు మరియు పారిశుధ్యం మంత్రిత్వశాఖ ద్వారా అమలు చేయబడుతుంది.
మిషన్ యొక్క ప్రధాన అంశాలుసవరించు
ఈ మిషన్ లో బహిరంగ మల విసర్జన నిర్మూలన, అపరిశుభ్ర మరుగుదొడ్లను ఫ్లష్ టాయిలెట్లుగా మార్పు, మానవీయ శుద్ధి, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో అన్ని 4041 చట్టబద్ధమైన పట్టణాల్లోనూ (i) వ్యక్తిగత గృహ మరుగుదొడ్లు అందించడం; (ii) సమాజ మరియు ప్రజా మరుగుదొడ్లు; మరియు (iii) మున్సిపల్ ఘన వ్యర్ధాల నిర్వహణ, భాగాలుగా ఉన్నాయి. ఇందులో 1.04 కోట్ల కుటుంబాలు కవర్ చేయబడి, కమ్యూనిటీ మరుగుదొడ్లకు 2.5 లక్షల సీట్లు, ప్రజా మరుగుదొడ్లకు 2.6 లక్షల సీట్లు మరియు అన్ని పట్టణాలకు ఘన వ్యర్ధాల నిర్వహణ సౌకర్యం సమకూరుస్తుంది. మిషన్ యొక్క లక్ష్యంసవరించు
ఇది పారిశుధ్యం మరియు దాని ప్రజారోగ్యం సంబంధాల గురించి పౌరులలో అవగాహన తీసుకురావడం మరియు ఆరోగ్యకరమైన పారిశుధ్యం పద్ధతులను గురించి ప్రజలలో ప్రవర్తనా మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో తలపెట్టబడింది.
ఈ లక్ష్యాలను నెరవేర్చడానికి సిద్దాంతాల రూపకల్పన, అమలు మరియు నిర్వహణ చేయడానికి స్థానిక సంస్థల పటిష్ట పరచాలనీ, మూలధన మరియు కార్యాచరణ వ్యయాలలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసేందుకు సరియైన వాతావరణాన్ని సృష్టించాలనే లక్ష్యంలో పెట్టబడింది.[1]
ప్రముఖ వ్యక్తులుసవరించు
అనిల్ అంబానీ సచిన్ టెండుల్కర్ సల్మాన్ ఖాన్ ప్రియాంకా చోప్రా రాం దేవ్ కమల్ హాసన్ మృదులా సిన్హా శశి తరూర్ షాజియా ఇల్మి మేరీ కాం అక్కినేని నాగార్జున సానియా మీర్జా మహమ్మద్ కైఫ్మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని వచ్చే ఐదేళ్లలో సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా గురువారం 2 అక్టోబర్ 2014 ప్రధానినరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. 24 సెప్టెంబర్ 2014న భారత కేంద్ర కేబినెట్, పట్టణప్రాంతాలలో స్వచ్చ భారత్ మిషన్ కు ఆమోదం తెలిపింది. ఈ మిషన్ అక్టోబర్ 2, 2014నుంచి ప్రారంభమై ఐదేళ్ళ పాటు అమలు చేయబడుతుంది.
ఈ మిషన్ దేశంలోని 4041 పైగా చట్టబద్ధమైన పట్టణాల్లో అమలు చేయబడుతుంది మరియు 62009 కోట్లరూపాయల ఖర్చులో 14623 కోట్లరూపాయలు కేంద్ర ప్రభుత్వం భరించనుంది.
ఈ మిషన్ స్వచ్చ భారత్ అభియాన్ లో పట్టణ విభాగంగా ఉండి పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ద్వారా అమలు చేయబడనుంది. అయితే, దీని గ్రామీణ విభాగం మాత్రం కేంద్ర తాగునీరు మరియు పారిశుధ్యం మంత్రిత్వశాఖ ద్వారా అమలు చేయబడుతుంది.