India Languages, asked by shubhsahu3263, 1 year ago

Short Poem on education in Telugu with meaning

Answers

Answered by snehitha2
25
Some poems related to education are:-

★విద్య నిగూఢ గుప్తమగు విత్తము; రూపము పూరుషాళికిన్
విద్య యశస్సు, భోగకరి, విద్య గురుండు, విదేశ బంధుడున్
విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్
విద్య నృపాల పూజితము, విద్యనెరుంగనివాడు మర్త్యుడే?!

★చదువని వాడజ్ఞుండగు
చదివిన సదసద్వివేక చతురత గలుగున్
చదువగ వలయును జనులకు
చదివించెదనార్యులొద్ద, చదువుము తండ్రీ!

★చదువు అవుతుంది నీ మెదడుకు ఎరువు
ఆ ఎరువుతో వస్తుంది నీకు కొలువు
కొలువుతో తీరుతుంది నీకు కరువు
కరువు తీరి నీ జీవితానికి వస్తుంది కొత్త వెలుగు.

★చదువుజదువుకున్న సౌఖ్యంబులునులేవు
చదువుజదివెనేని సరసుడగును
చదువుమర్మమెరిగి చదువంగచూడుము
విశ్వదాభిరామ వినురవేమ!

★చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా
చదువు నిరర్ధకంబు, గుణసంయుతులెవ్వరు మెచ్చరచ్చటన్
బాదనుగా మంచికూర నలపాకము చేసిన నైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచిపుట్టగ నేర్చునటయ్య భాస్కరా!

I'm going to give meaning of the poem:-

★చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా
చదువు నిరర్ధకంబు, గుణసంయుతులెవ్వరు మెచ్చరచ్చటన్
బాదనుగా మంచికూర నలపాకము చేసిన నైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచిపుట్టగ నేర్చునటయ్య భాస్కరా!

భావం - ఎంత గొప్పగా వండినా ఉప్పు లేని కూర రుచించదు. అలాగే ఎంత చదివినా, ఆ చదువు సార ము గ్రహించలేకపోయినట్లయితే ఆ చదువు నిరుపయోగము. ఎవరూ మెచ్చుకొనరు
Answered by Anonymous
12

Hope u understood.............

Attachments:
Similar questions