Srinadhudu rasina 5 Telugu padyalu with bhavam
Answers
Answer:
1.కుశలమస్తు లస చ్ఛాతకుంభ కుంభ
జంభవి త్కుంభి కుంభా విజృంభమాణ
భూరి భవదీయ వక్షోజములకు మేరు
మందరము లుండు పర్యంత మిందువదన
2.శ్రుతి శాస్త్ర స్మృతు లభ్యసించుకొని విప్రుండంత నానాధ్వర
వ్రతుడై పోయి కనున్ బురందర పురారామ ద్రుమానల్ప క
ల్పతరు ప్రాంత లతా కుడుంగ సుఖ సుప్త ప్రాప్త రంభా భగ
ప్రతి రోమాంకుర పాటన క్రమ కళా పాండిత్య శౌండీర్యమున్
3.వంకర పాగలున్ నడుము వంగిన కత్తులు మైలకోకలున్
సంకటి ముద్దలున్ జనుప శాకములున్ బులు పచ్చడంబులున్
దెంకగు నోరచూపులును దేకువ దప్పిన యేసబాసలున్
రంకుల బ్రహ్మ ఈ మసర రాజ్యము నెట్లు సృజించెనో కదా
4.మందరాద్రి సములు మానవులందరు
చందమామ కూన లిందుముఖులు
కందులేని మౌక్తికంబులు జొన్నలు
కుందనంపు బెడ్డ కుందుగడ్డ
5.వీరులు దివ్యలింగములు విష్ణువు చెన్నుడు కల్లిపోతురా
జారయ గాలభైరవుడు సంకమ శక్తియ యన్నపూర్ణయున్
గేరెడి గంగధార మడుగే మణికర్ణికగా జెలంగు నీ
కారెమపూడి పట్టణము కాళిగదా పలనాటి వారికిన్