Swami vivekanada short essay in telugu
Answers
Answer:
స్వామీ వివేకానంద భారతదేశానికీ, హిందూ మతానికి ప్రాతినిధ్యం వహిస్తూ 1893 సెప్టెంబరు 11న చికాగోలో మొదటి ప్రపంచ మత సమ్మేళనంలో చేసిన ప్రసంగం సుప్రసిద్ధమైనది. స్వామీ వివేకానంద 1983 ప్రపంచ మత సమ్మేళనానికి భారత దేశానికీ, హిందూ మతానికి ప్రాతినిధ్యం వహించారు. 11 నుంచి 1893 సెప్టెంబరు 27లో నిర్వహించిన ఆ సమ్మేళనం మొదటి ప్రపంచ మత సమ్మేళనం. ప్రపంచవ్యాప్తంగా పలు మతాల ప్రతినిధులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. వివేకానంద చేసిన ఈ చరిత్రాత్మక ప్రసంగంలో ప్రియమైన అమెరికా సోదర సోదరీమణులారా (మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా) అని సంబోధిస్తూ ప్రారంభించడంతోనే శ్రోతలను ఆకట్టుకున్నారు. సాధారణంగా లేడీస్ అండ్ జంటిల్మన్ అన్న సంబోధనకు అలవాటు పడ్డ వారిని, ఈ పిలుపులోని ఆత్మీయత ఆకర్షించింది. ఆయన సందేశానికి, వాక్పటిమకూ, నిజాయితీతో కూడిన సంభాషణకు అక్కడి ప్రతినిధులు ఆకర్షితులయ్యారు. అమెరికన్ పత్రికలు సైతం వివేకానందుని వ్యక్తిత్వం, సందేశాన్ని ప్రశంసించాయి.