telangana rastram nu parisilisthe needu grammalalo parithithulu ella unnayi?vishayalanu sekarincho rayandi
plz say this answer it is urgent
Answers
తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ తెలంగాణ రాష్ట్రం లోని పారిశ్రామిక ప్రాంతాలను అభివృద్ధికి కావలసిన మౌలిక సదుపాయాలు సమకూర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంస్థ. ఇది 2014లో ప్రారంభించబడింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్లాట్లు/షెడ్లు, రోడ్లు, డ్రైనేజ్, నీరు, విద్యుత్, ఇతర మౌలిక సౌకర్యాలు కలిగి గుర్తించి, వాటి అభివృద్ధి దిశగా తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ కృషిచేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు సాగుతుంది.
తెలంగాణ రాష్ట్రం జూన్ 2 2014 న అవతరించింది. బంగారు తెలంగాణగా తీర్చి దిద్దుకునే క్రమంలో నీటి పారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ లభ్యమవుతున్న నీటి వనరులను ఉపయోగించుకొని వ్యవసాయ రంగం , పారిశ్రామిక రంగం పటిష్టం చేసుకుంటూ, తాగునీటిని సమకూర్చడానికి కృషి చేస్తుంది. దీనికి గాను మన లక్ష్యాన్ని సాధించడానికి వివిధ సాగునీటి ప్రాజెక్టులను అమలు చేయడంలో ఈ శాఖ ముఖ్య భూమిక పోషిస్తుంది.
తెలంగాణ ప్రాంతంలో సాగునీటి అభివృద్ధి గోదావరి, కృష్ణనదులు, వాటి ఉపనదులు , చెరువులు, సరస్సులపై ప్రధానంగా ఆధారపడుతున్నది. తెలంగాణ ప్రాంతంలో చెరువులు అత్యంత ప్రాధాన్యత వనరులుగా ఉన్నాయి. భారీ చెరువుల నుండి చిన్న కుంటలు, ఇంకుడు చెరువులు అన్ని కలుపుకొని 46,531 నీటి వనరులు ఉన్నాయి. ఈ చెరువులను పునరుద్ధరించి, పునర్జీవింప చేయడానికి మిషన్ కాకతీయ కార్యక్రమం చేప్పటింది. రాష్ట్ర సర్వతోభిమూఖాభివృధికి రెండు నదుల నీటిని వినియోగించుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి గోదావరి మరియు కృష్ణ నదులలో ఆధారపడదగ్గ, మిగులు వరద నీటిని సంపూర్ణంగా వినియోగించాలని ప్రభుత్వం ప్రణాలికను రూపొందిస్తుంది.