India Languages, asked by jaseem3804, 1 year ago

Tell about farmer in Telugu







Answers

Answered by rammohan369
1
వ్యవసాయము సంబంధమైన పనులు చేసేవానిని రైతు, కర్షకుడు లేదా వ్యవసాయదారుడు అంటారు. రైతు దేశానికి వెన్నెముక అని చెప్పవచ్చు. పూర్వకాలంలో "ఉత్తంకేతి మద్యంవాన్ కరె చాకిరి కుకర్ నినాన్" అనే హిందీ నానుడి ప్రచారంలో ఉండేది. దీనికి అర్ధం - వ్యవసాయం ఉత్తమం, వ్యాపారం మధ్యమం, ఉద్యోగం అధమం. భారత దేశంలోని హరిత విప్లవంతో రసాయన మందులు వాడి వ్యవసాయం దెబ్బతినడం వల్ల గత 40, 50 సంవత్సరాలుగా ఉద్యోగం ఉత్తమంగా భావించబడుచున్నది.[1]


రైతుల్లోనాలుగో వంతు రైతులు కౌలుదారులున్నారు.వారి సంఖ్య ఇంకా ఎక్కువనేది బ్యాంకర్ల భావనమహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తీసుకునే భూముల కౌలుకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కౌలు కు ఇచ్చేవారు, తీసుకునే వారి ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ చట్టాన్ని రూపొందించారు.స్వయం సహాయక సంఘాల్లో భూమి లేని నిరుపేద మహిళలు ఉమ్మడిగా వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. వ్యవసాయ భూముల ఒప్పందాలు రాత పూర్వకంగా చేసుకోవాలి. కౌలు కాలపరిమితి కనీసం 5 సంవత్సరాలు ఉండాలి. భూమిపైన పంట రుణం తీసుకునే అర్హత కౌలుదారుకు కలుగుతుంది. పంటలు దెబ్బతిన్న సందర్భంలో పంటల బీమాయేగాక ప్రభుత్వం ఇచ్చే పరిహారం పొందడానికీ అవకాశముంటుంది. అయితే భూమిపై ఎలాంటి హక్కు ఉండదు. కౌలు సమయంలో భూమి అభివృద్ధిపై పెట్టిన మొత్తాన్ని కోరేహక్కు కౌలుదారుకు ఉండదు. వ్యవసాయ భూములను కౌలుకు ఇవ్వడం, తీసుకోవడం సహజంగా నోటిమాటగా సాగుతుంది. దీనివల్ల తరచుగా కౌలుదారు మారిపోతాడు. భూ యజమాని ఇష్టమే ఇక్కడ ప్రధానం. కౌలుదారు భూమి అభివృద్ధికి పెట్టుబడి పెట్టినా మరుసటి సంవత్సరం అతని పేరుపైన కౌలు ఉంటుందన్న నమ్మకం ఉండదు. బ్యాంకుల నుంచి పంట రుణాలు అందడం లేదు. కౌలుదారులకు సంస్థాగత రుణాలు, పంటల బీమా తదితర సదుపాయాలను కల్పించేందుకు కౌలు చట్టాలను సవరించటమే తరుణోపాయం. భూమి యజమాని హక్కులకు ఎలాంటి విఘాతం కలగని రీతిలో రాష్ట్రాలు తమ కౌలు చట్టాల్లో మార్పులు తేవాలని 11వ పంచవర్ష ప్రణాళిక మధ్యంతర సమీక్ష నివేదిక స్పష్టం చేసింది.కౌలుచట్టాన్ని సవరించడమంటే భూముల యజమానుల హక్కులను వదులు కోవటం కానేకాదని, యాజమాన్య హక్కులు బదిలీ కాని రీతిలో తగిన భరోసాను ఇచ్చే సవరణలు రావాలని నివేదిక సూచించింది. కౌలు పరిమితి పూర్తి కాగానే భూమిని వెనక్కి తీసుకొనే అధికారం యజమానికి ఉండాలని, అన్ని వర్గాల వారూ భూమిని కౌలుకు తీసుకోగల వాతావరణం ఉండాలని సూచించింది.కౌలుదార్ల బృందాలకు స్వశక్తి సంఘాల మాదిరిగా పావలా వడ్డీకి రుణాలను ఇవ్వాలంది నాబార్డు.

Answered by sunkaraanuradha1984
0

Answer:

మనకు తినటానికి అవసరమయ్యే ఆహారాన్ని పండించే వ్యక్తే రైతు.

రైతు రాత్రి పగలు కష్టపడి పంటల్ని పండించి మనకు ఆహారాన్ని అందిస్తాడు.

రైతు కు మరో పేరు వ్యవసాయదారుడు.పంటల్ని పండించే విధానాన్ని వ్యవసాయం అంటారు అందుకే రైతును వ్యవసాయదారుడు అంటారు.

పంటల్ని పండించేవారినే కాకుండా కోళ్ళని , పశువుల్ని , చేపల్ని ,తేనెటీగల్ని , సిల్క్ పురుగుల్ని పెంచే వారిని కూడా రైతులనే అంటారు.

రైతు ధాన్యాన్నే కాకుండా పాలను కూడా ఉత్పత్తి చేస్తాడు.

చేపల్ని ,కోళ్ళని పెంచుతాడు రైతు.

ఈ విధంగా రైతు తన కుటుంబానికి కావాల్సిన ఆదాయాన్ని సంపాదించుకుంటాడు.

Similar questions