India Languages, asked by roshankumar200ou9cs3, 1 year ago

tell me any 5 telugu poems about importance of studies with bhavam

Answers

Answered by snehitha2
13
Hi friend!!

★చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా
చదువు నిరర్ధకంబు, గుణసంయుతులెవ్వరు మెచ్చరచ్చటన్
బాదనుగా మంచికూర నలపాకము చేసిన నైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచిపుట్టగ నేర్చునటయ్య భాస్కరా!

భావం - ఎంత గొప్పగా వండినా ఉప్పు లేని కూర రుచించదు. అలాగే ఎంత చదివినా, ఆ చదువు సార ము గ్రహించలేకపోయినట్లయితే ఆ చదువు నిరుపయోగము. ఎవరూ మెచ్చుకొనరు

★విద్య నిగూఢ గుప్తమగు విత్తము; రూపము పూరుషాళికిన్
విద్య యశస్సు, భోగకరి, విద్య గురుండు, విదేశ బంధుడున్
విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్
విద్య నృపాల పూజితము, విద్యనెరుంగనివాడు మర్త్యుడే?!

భావం - విద్య అనేది మనం రహస్యంగా దాచిపెట్టుకునే ధనం లాంటిది. అంటే.. చదువుకున్నవారైతే మీకున్న గుప్త ధనం చదువేనన్నమాట. మానవులకు చదువు అందాన్నిస్తుంది.. కీర్తిని, సుఖాన్ని ఇస్తుంది.విద్యయే గురువు, విదేశాలలో బంధువు, దైవం కూడానూ. ఈ భూమిమీద విద్యకు సాటి అయిన ధనం ఏదీ లేదు. సలకుల చేత పూజింపబడేది విద్య. విద్యరాని వాడు మనిషా..? అంటే, కాదు అని అని పద్యం యొక్క భావం.

★చదువని వాడజ్ఞుండగు
చదివిన సదసద్వివేక చతురత గలుగున్
చదువగ వలయును జనులకు
చదివించెదనార్యులొద్ద, చదువుము తండ్రీ!

భావం - హిరణ్య కశ్యపుడు తన కొడుకు ప్రహ్లాదుడిని గురువుల దగ్గరికి పంపిస్తూ అంటున్నాడు- “బాబూ! చదవనివాడికి విషయాలే తెలీదు. మరి చదివితే ఏమవుతుంది? మంచి-చెడుల మధ్య తేడా ఏంటో తెలుసుకోగలిగే శక్తి వస్తుంది. అందువల్ల అందరూ చదువుకోవాలి. నిన్ను నేను మంచి గురువుల దగ్గర ఉంచి చదివిస్తాను నాయనా, చక్కగా చదువుకో!” అని.

★చదువుజదువుకున్న సౌఖ్యంబులునులేవు
చదువుజదివెనేని సరసుడగును
చదువుమర్మమెరిగి చదువంగచూడుము
విశ్వదాభిరామ వినురవేమ!

★చదువు అవుతుంది నీ మెదడుకు ఎరువు
ఆ ఎరువుతో వస్తుంది నీకు కొలువు
కొలువుతో తీరుతుంది నీకు కరువు
కరువు తీరి నీ జీవితానికి వస్తుంది కొత్త వెలుగు.

Hope it helps
Answered by qwblackurnrovers
0

భావంతో తెలుగు పద్యాలు

1.చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు ; కొంచమైనా నదియు కొదువ కాదు ; విత్తనంబు మర్రివృక్షంబునకు నెంత ! విశ్వదాభిరామ! వినురవేమ!

భావం :మనసుపెట్టి చేసే ఏ చిన్న పని అయినా సత్ఫలితాన్నిస్తుంది, మనసు దానిమీద లేకపోతే అది ఫలించదు. మర్రి చెట్టు విత్తనం ఎంత చిన్నదయినా ఏంతో  పెద్ద చెట్టయి విస్తరిస్తుంది . కాబట్టి ఏ in పనైనా మనసుపెట్టి చేయాలి

2.ఉప్పుకప్పురంబు నొక్క పోలిక నుండు ; చూడ చూడ రుచుల జాడవేరు ;

పురుషులందు పుణ్య పురుషులు వేరయా! విశ్వదాభిరామ! వినురవేమ!

భావం :ఉప్పు కర్పూరం చూడడానికి ఒకేవిధంగా అంటే తెల్లగా ఉంటాయి, కానీ వాటి రుచిలో వ్యత్యాసం ఉంటుంది . అదే విధంగా మనుషులు అందరూ చూడడానికి ఒకేవిధంగా వుంటారు కానీ, వారి స్వభవాలు ఒకేవిధంగా వుండవు. మంచివారు వుంటారు, చెడ్డవారువుంటారు

3.అనువుగాని చోట నధికుల మనరాదు కొండ యద్దమందు కొంచమైయుండదా

కొంచె ముండుటెల్ల కొదవుగాదు

విశ్వదాభిరామ! వినురవేమ!

భావం :అవకాశం లేని చోట గొప్పవారం అని చెపుకోకూడదు . కొండ అద్దం లో చిన్నగా కనిపించినంత మాత్రాన,నిజంగా కొండ చిన్నదై పోతుందా..

4. ఇనుము విరిగినేని ఇనుమారు ముమ్మారు కాచి యతుకనేర్చు గమ్మరీడు మనసు విరిగెనేని మరియంట నేర్చునా ?

విశ్వదాభిరామ! వినురవేమ!

భావం :ఇనుము రెండు మూడు సార్లు విరిగినా దానిని కమ్మరి సులువుగా అతికిస్తాడు,కానీ మనిషి మనసు ఒక్కసారి విరిగితే మళ్ళీ దానిని అతికించడం దేవుని వల్లకూడా కాదు .

#SPJ2

Similar questions