India Languages, asked by deepak3311, 1 year ago

Telugu bashagoppathanam meeda sukthulu in telugu

Answers

Answered by binduprasunaalooru
2

Answer:

దేశ బాషలందు తెలుగు లెస్స.

తెలుగు బాష లోని తీయదనం మరే బాషలో లేదు.

ఆంధ్రులకు తెలుగు బాష తల్లి లాంటిది. మాతృభాష ఏదైనా అది తల్లి తో సమానం.  తల్లిని ఎంతగా గౌరవము ఇస్తామో, మన మాతృభాష  ని కూడా అంతే  గౌరవించాలి.  అది ఏ బాషైనా కావచ్చుు. ఎవరి భాష వారికి గొప్ప.  తెలుగు భాష కి చాలా గొప్ప చరిత్ర ఉంది.  తెలుగు భాష  తెలుగు  ప్రజల కోసం  సంస్కృతం నుండి ఆవిర్భవించింది.   తెలుగు లో ఎందరో కవులు, రచయితలు  గ్రంధ కర్తలు చాలా చాలా రచనలు చేశారు.

 మన తెలుగు లో 56 అక్షరాలు ఉన్నాయి. అంటే ఇంగ్లీష్ కన్నా ఎక్కువ శబ్దాలు, పదాలు  తెలుగు లో మాట్లాడొచ్చు.  తెలుగు అక్షరాలు పలకడంలో మనకు ఇంగ్లీషు లో ల తికమకలు ఉండవు.  మనలోపలి అనుభూతులను పైకి చెప్పడానికి తెలుగు భాషలో అన్నీ సాధనాలు ఉన్నాయి.  ఏదైనా విషయం తెలుగులో ఇంగ్లీషు కన్నా క్లుప్తంగా ను , భావసమ్మితం  గాను మనం తెలుగులో చెప్పగలం.

 తెలుగు భాష గొప్పతనం తెలియాలంటే తెలుగులో సంభాషించాలి.  గొప్పవాళ్లు రాసిన రచనలు పద్యాలు, గద్యాలు, గేయాలు, కథలు, కవితలు, పల్లెగీతాలు, కూనిరాగాలు, ఇంకా హాస్య రచనలు, విప్లవ రచనలు , విప్లవ గీతాలు చదవాలి.  ఎన్నిటిలోనూ వారు చేసే భావ ప్రకటన, కొత్త కొత్త పదాలు, ప్రాసలు, సంగీతాలంకారాలు, జ్ఞానం, చరిత్ర తెలుస్తాయి.

  మన తెలుగు భాష విజయనగర సామ్రాజ్యం చక్రవర్తి సామ్రాట్టు శ్రీ కృష్ణదేవరాయలు కాలం లో చాలా అభివృద్ధి చెందినది.  తెలుగు భాష లోకి ఎన్నో గ్రంధాలు అనువదింపబడ్డాయి. నన్నయ తెలుగు లో మొదటి కావ్యం రచించారు.  అందుకని ఆయనని ఆదికవి అంటారు. కృష్ణదేవరాయల సభలో అష్టదిగ్గజాలు  అని ఎనిమిది కవులుండేవారు . అందులో వికట కవి తెనాలి రామకృష్ణ, నంది తిమ్మన మొదలైన కవులుండే వారు. శ్రీ రామదాసు కృతులు , శ్రీ త్యాగరాజ కృతులు , జయదేవుని అష్టపదాలు ఇలా ఎన్నో గొప్ప రచనలు తెలుగు లో మన కు కనిపిస్తాయి. శ్రీ బమ్మెర పోతన భాగవతం చదువుతుంటే ఎవరిలోనైనా భక్తి భావం పొంగి పొరలుతుంది.  వేమన శతకం (పద్యాలు) పామరులకు నీతి బోధిస్తుంది.  శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి తెలుగు లోనే చెప్పిన మాటలు ఎన్నో మహత్వపూర్ణమైనవి.  నండూరి సుబ్బారావు గారి ఎంకి పాటలు ఎంతో ఆదరాన్ని పొందాయి.  శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల కీర్తనలు విని పరవశించని వారు ఎవరూ ఉండరు అంటే అతిశయోక్తి లేదు.

  తెలుగు ప్రజలు ఆదినుంచి శాంతస్వభావులు, విశాల హృదయులు మరి పరభాషలను ఎంతో గౌరవిస్తారు.  వేరే వారి సంస్కృతి, భాషలను మన తెలుగులో వెంటవెంటనే కలిపేసుకుంటాం.  ఇంగ్లీషువాళ్లు తెలుగుని ఇటాలియన్ (Italian of the east) ఆఫ్ ద ఈస్ట్ అని అన్నారు.  అంటే అంత తీయని , చెవులకు ఇంపైన భాష అన్నమాట.  తెలుగు భాష కి, హిందికి, ఫ్రెంచ్ భాషకి, ఇటాలియన్ కి ఎన్నో పోలికలున్నాయి.  గవర్నమెంటు పనులకు, కోర్టు వ్యవహారాలకు, వైద్య విద్య నేర్చుకోడానికి, ఇంజనీరింగు నేర్చుకోడానికి, భౌతిక రసాయన శాస్త్రం లాంటివి నేర్చుకోడానికి, మరి  అంతర్జాతీయం గాను, భారత దేశం లో అన్య భాషా పరులతో కలిసి సంభాషించడానికి ఇంగ్లీష్ వాడకం లో ఉండడంవల్ల తెలుగు భాషలో ఆసక్తి తగ్గిపోయింది.  తెలుగు పద్యాలలో ఉన్న వైవిధ్యం సంస్కృతం లో ఉన్నంత గొప్పగా ఉంటుంది. ఎన్నో రకాలుగా శ్రోతలను రంజింప చేస్తాయి. 

 ఇక తెలుగు లో అష్టావధానం, శతావధానం అనే భాషా ప్రజ్ఞాన ప్రదర్శన (test on multiple facets) అతి చక్కని ఉదాహరణ మన తెలుగు గొప్పతనాన్ని చెప్పుకోడానికి.  ఇట్లాంటివి ప్రపంచం లో మరి ఏ ఇతర  భాషలోనూ లేవు.  మన అచ్చమైన తెలుగు పాటలకు  కూచిపూడి నాట్యం తో అభినయాలు చేస్తుంటే ఆ ఆనందం అనుభూతి మాటలతో చెప్పలేం.

 మన పట్టణాలు, పల్లెలు, అక్కడ ఉండే ప్రజలు, విహారయోగ్యమైన ప్రదేశాలు, యాత్రికుల అనుభవాలు, కట్టడాలు, సెలయేర్లు, అడవులు, వన్య ప్రదేశాలు, గుడులు గోపురాలు, ఇంకా నదులు, పుణ్య క్షేత్రాలు,  ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి మన ప్రదేశాలలో.  కానీ మనం అన్నీ చూడలేము.  వాటినిగూర్చి మనం తెలుసుకొని  ఇంకొకరికి ఆవిషయాలు చెప్పాలి.  మన భాష గొప్పతనం ముందర మనం అర్ధం చేసుకొని  తరువాత అది తెలియని వారికి చెప్పాలి.

  విశ్వనాథ సత్యనారాయణ గారు ఎన్నో మంచి రచనలు చేశారు. అందులో వేయి పడగలు చాలా ప్రసిద్ధి చెందింది.  ఇంకా 19వ , 20వ శతాబ్దాల్లో మన సమాజం లో ఉన్న కొన్ని దురాచారాలని మత్తు పెట్టడానికి ఎందరో ఎన్నో మంచి హాస్య నాటికలు , నవలలు రాశారు.  ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గాత్రం లో తెలుగు పాటలు ఎందరినో దశాబ్దాల తరబడి మంత్ర ముగ్ధులను చేశాయి.

  మన  భాషలో ఎన్నో గొప్ప భకృ గీతాలు, మహాభారతం, రామాయణం ,  భాగవతం, దశావతారాలు ఇలా ఎన్నెన్నో ఉన్నాయి.  మనం ఈకాలంలో ఇవేవీ చదవకుండా పాశ్చాత్య సంస్కృతి పైనే ఎక్కువ మక్కువ చూపడం  న్యాయం కాదు పద్ధతి కాదు.  అది మాతృ ద్రోహం చేయడమే.  ఇన్ని ఎందుకు.  ఎన్నో సంవత్సరాలు గా అమెరికా లో నో మరే ఇతర ప్రాంతాలలో ఉన్న మన తెలుగువారు ఇప్పటికీ తెలుగు అంటే ఎంతో అభిమానం చూపిస్తారు. అంటే మన తెలుగు గొప్పదన్నమాటేగా.

  భారత దేశం లో  ఎన్నో భాషలు ఉన్నాయి.  ఎవరి భాష వారు నేర్చుకొని అందులో ఉన్న తీపి ని  ఆస్వాదించ గలిగితే,  వారు తప్పకుండ మాతృభాషలకు అభిమానులౌతారు.  ఈ కాలం లో పిల్లలు మాతృ భాషను కించపరచ రాదు.  ఇంగ్లీషు హింది మరి ఇతర భాషలు నేర్చుకోవాలి.  కానీ  తెలుగు భాషని గౌరవించాలి.  ప్రపంచం లో అందరి ముందర మన తెలుగు లో చతురం గా మాట్లాడి, కవిత్వాలు చెప్పి, పాటలు మధురం గా పాడి , పద్యాలు రాసి, సరి కొత్త రచనలు చేసి  మన బుద్ధి కుశలత ని , మన జాతి చరిత్రను నిలబెట్టాలి. 

Answered by nagubaikadapa
2

Explanation:

it will help you

Mark me brainlist

Attachments:
Similar questions