India Languages, asked by rachel4768, 11 months ago

Telugu short essay on Fox

Answers

Answered by Anonymous
4

\huge{sf{\boxed{\boxed{Answer:}}}}

చెవుల నక్క యొక్క శాస్త్రీయనామం "వల్పీస్ జెర్డా". ఇదొక చిన్న రాత్రించర నక్క జాతికి చెందిన జంతువు. ఈ నక్క ఎక్కువగా ఉత్తర ఆఫ్రికా ప్రాంతపు పెద్దఎడారి యైన సహారా ఎడారి, సీనై ద్వీపకల్పం మఱియు నైఋత్య ఇజ్రాయిల్లోని అరవా ఎడారి ప్రదేశాలలో కనిపిస్తాయి. వీటియొక్క విశిష్టమైన శరీరావయవాలు, చెవులు. అవి అంత పెద్దగావుండటానికి కారణం వీటి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికే. ఈ నక్క యొక్క ఆంగ్లనామం బెర్బర్ భాషాపదమైన "ఫనాక్" (అనగా నక్క) మఱియు వీటి జాతినామమైన "జెర్డా"అనేది యవన భాషాపదమైన "క్సెరాస్" (అనగా పొడి లేదా తేమలేని) నుండి వచ్చాయి. కుక్కలు, నక్కలు మఱియు తోడేళ్ల కుటుంబమైన కానిడేకు చెందిన సభ్యులలో శరీర పరిమాణం అతిచిన్నదిగావున్నది ఈ చెవుల నక్కకే. దీని చర్మం, చెవులు మఱియు మూత్రపిండాలు ఉష్ణోగ్రతలు ఎక్కువ, నీరు తక్కువ గల ఎడారి వాతావరణానికి బాగా అలవాటుపడినవి. దీని చెవులు కూడా చిన్నచిన్న ప్రాణులైన పురుగులు, కుందేళ్లు మొదలైనవాటి కదలికలను వినేటంత సున్నితమైన నిశితశక్తిగలిగి ఉంటుంది.

చెవులనక్క జీవితకాలం పెంపకంలో పదునాలుగేళ్లు. దీని ముఖ్యమైన శత్రువులు గద్దలు, గుడ్లగూబలు మఱియు ఇతర పెద్ద నక్కలు. చెవులనక్క కుటుంబాలు కలిసి ఒకచోటనే పెద్దపెద్ద బొరియలను తవ్వుకొని వాటియందు రక్షణకొఱకు మఱియు సంతానంకొఱకు నివసిస్తాయి. వీటి సరియైన సంఖ్య ఎడారులలో ఎంతవుందో చెప్పటం కష్టం కాని ఇవి, ఇప్పుడప్పుడే అంతరించిపోవడానికి మాత్రం ఏం అవకాశాలు లేవని చెప్పగలము. ఇవి గుంపులుగా ఉన్నప్పుడు చేసే చేష్టల గుఱించి, వీటి జీవనశైలి గుఱించి అంత కచ్చితంగా చెప్పలేము. జూలలో పెంపకంలోనున్న చెవులనక్కలనుబట్టి, వాటి ప్రవర్తనను అంచనా వేయవచ్చుగాని, అదే వాటి అసలైన ప్రవర్తనా అని చెప్పలేము. ఈ నక్కలు ఇతర నక్కల జాతులవలె "వల్పీస్"జన్యువుకు సంబంధించినవి. వీటి సున్నితమైన వెంట్రుకలు గల చర్మం ఆఫ్రికాలోని ఇవి సంచరించే ప్రదేశాలలోని ఆటవికులకు బాగా ఇష్టం. ఈ నక్కలు ప్రపంచవ్యాప్తంగా మొదటి పది ముద్దులోలికే పెంపుడు జంతువుల జాబితాలో స్థానం సంపాదించుకొని ప్రసిద్ధి చెందాయి.

Similar questions