English, asked by sandhyachindam19, 9 months ago

the million march in Telugu​

Answers

Answered by priyanshiojha51
1

మిలియన్ మార్చ్ తెలంగాణ ఉద్యమ కాలంలో 2011 మార్చి 10 న ప్రజలందరు కలిసి అద్భుతంగా విజయవంతం చేసిన కార్యక్రమం మిలియన్ మార్చ్. ఉద్యమకారులకు, ప్రజలకు అదో మానసిక స్థైర్యాన్ని ఇచ్చింది. తెలంగాణా జే ఎ సి మిలియన్ మార్చ్ కు పిలుపునిచ్చింది. తొలుత మిలియన్ మార్చ్ ను చాలా భారీ ఎత్తున జరపాలనేది తెలంగాణ జేయేసీ వ్యూహం. అయితే మార్చి 10 న జరగవలసిన ఇంటర్ మీడియట్ పరీక్షను వాయిదా వేస్తామని మాట ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, తరువాత పరీక్ష వాయిదా వెయ్యలేదు. దీంతో మిలియన్ మార్చ్ ను కొంచెం వెనకకు జరుపుదామని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిపాదించింది. అయితే జేయేసీలోని బీజేపీ, సీ.పీ.ఐ. ఎం.ఎల్, ఇతర ఉద్యోగ, ప్రజా సంఘాలు మాత్రం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవద్దని గట్టిగా పట్టుబట్టాయి. దీనితో ప్రొ. కోదండరాం ఆధ్వర్యంలో జేయేసి ఒక రోజంతా చర్చించి చివరికి మధ్యేమార్గంగా మిలియన్ మార్చ్ ను ఒక ర్యాలీ రూపంలో జరపాలని నిర్ణయించాయి. ప్రజల నుంచి మిలియన్ మార్చ్ ప్రచారానికి అపూర్వ స్పందన రావడంతో టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వామపక్షాలు కూడా కలసికట్టుగా కదిలాయి. తెలంగాణ ఉద్యమ చరిత్రలో మిలియన్ మార్చ్ ది ఓ ప్రత్యేక స్థానం.

మిలియన్ మార్చ్

Miliyan mārc

please mark it as brain list answer

Similar questions