TI. స్వీయరచన
. క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
"తుచ్ఛ సౌఖ్య సంపాదనకై యబద్ధములఁ బల్కకుఁ వాదము లాడబోకు" అని భాస్కర కవి ఎందుకు చెప్పి ఉంటాయి
Answers
Answer:
1) క్షేత్రం 2) జడిపించు
ఆ) కిందివాక్యాలలో గీతగీసిన పదాలకు సరైన అర్థం గుర్తించండి? 4ఞ1/2ొ2
3) శ్రీరాముడికి వచ్చిన కడగండ్లు ఎవరికీ రాకూడదు (బి)
ఎ) సంతోషాలు బి) కష్టాలు
సి) రాళ్లు డి) సంపదలు
4. నాకు నిరయం దాపురించినా సరే ఇచ్చిన మాట తప్పను? (సి)
ఎ) నరకం బి) బ్రతుకు
సి) ప్రాణం డి) స్వర్గం
5. మా ఊరి చెరువు విశాలంగా ఉన్నది? (డి)
ఎ) భావి బి) జలధి
సి) నది డి) తటాకం
6) భోజనంపై నెయ్యి అభిఘరించారు. (డి)
ఎ) కలిసినారు బి) కడిగినారు
సి) తిన్నారు డి) చల్లినారు
ఇ) గీతగీసిన పదానికి పర్యాయపదాలు రాయండి?
4ఞ1/2ొ2
7. మా ఇంటి లక్ష్మి మాకు ముఖ్యం (బి)
ఎ) శ్రీ, వస్త్రం, సాలెపురుగు
డి) శ్రీ, ఇందిర, కమల
బి) స్త్రీ, శ్రీ, వనిత
డి) అంబరం, సంపద, వాన
8. ముసలితనంలో పిల్లలు అండగా ఉంటారు. (డి)
ఎ) కుండ, గ్రుడ్డు బి) ఎక్కువ, సంతోషం
సి) ఆసరా, ఆనందం డి) ఆసరా, తోడు
9. మనదేశ సైన్యం ప్రపంచంలోనే అత్యుత్తమమైనది. (ఎ)
ఎ) బలం, సేన బి) గొప్ప, అధికం
సి) రక్షణ, శిక్షణ డి) ఒప్పు, నిజం
10. నిజాం రాజుల గుండెల్లో తెలంగాణ వీరులు కల్లోలం రేపినారు. (సి)
ఎ) అలుక బి) కోపం
సి) పెద్ద అలజడి డి) బాధ
ఈ) గీతగీసిన వాటికి నానార్థాలు గుర్తించండి.
2ఞ1/2ొ1
11. నాప్రాణం పణంగా పెట్టైనా నిన్ను కాపాడుకుంటాను.
(బి)
ఎ) పందెం, వెల, ధనం
బి) అడ్డు, ఆయుధం, ఆధారం
సి) కీర్తి, సంపద, స్థానం
డి) తోడు, అద్భుతం, ఆవిరి
12. తెలంగాణ రాష్ట్రంలో సంబరాలు జరిగాయి. (సి)
ఎ) నేల, నింగి బి) మేను, శరీరం
సి) జాతర సేన
డి) తోడు అద్భుతం, ఆవిరి
ఉ) కింద గీతగీసిన పదానికి ప్రకృతికి వికృతి, వికృతికి ప్రకృతి పదాన్ని గుర్తించండి? 4ఞ1/2ొ2
13. ఆమె శిఖలో మల్లెపూలు పెట్టుకున్నది. (బి)
ఎ) తల బి) సిగ
సి) సంచి డి) సెగ
14. నేను చాలా దూరం ప్రయాణించాను. ప్రయాణం..(బి)
ఎ) పవనం బి) పయనం
సి) ప్రమాణం డి) ప్రయాణం
15. అజాగ్రత్తగా వాహనాన్ని నడిపితే మృత్యువు మనవెంటే ఉంటుంది? (ఎ)
ఎ) మరణం బి) వడ్డి
సి) అసలు డి) కొసరు
16. పిల్లలకు కైతలంటే చాలా ఇష్టం. (బి)
ఎ) కథ బి) కవిత
సి) పుస్తకం డి) కలం
ఊ) ఈ కింది పదాలకు వ్యుత్పత్త్యర్థాలను గుర్తించండి?
2ఞ1/2ొ1
17. విశ్వంభరుడు వ్యుత్పత్త్యర్థం (సి)
ఎ) లోకాన్ని పాలించేవాడు
బి) స్వర్గాన్ని జయించేవాడు
సి) విశ్వాన్ని భరించేవాడు
డి) అన్నింటినీ లక్కొనేవాడు
18. 'వేదవ్యాసుడు' వ్యుత్పత్త్యర్థం (బి)
ఎ) వేదాలను రాసినవాడు
బి) వేదాలను విభజించినవాడు
సి) వేదాలను అతిక్రమించినవాడు
డి) వేదాలను ఆక్రమించినవాడు
తెలుగు మోడల్ పేపర్ 2
1. అవగాహన - ప్రతిస్పందన 5ఞ1ొ5
అ) శ్రీరామచంద్రాదులు వానరసైన్యంలో సువేల పర్వతా నికి చేరుకున్నారు. ఆ రాత్రి అక్కడే గడిపారు. ఎత్తైన ఆ పర్వత శిఖరం నుంచి లంకానగర శోభను చూశారు. లంకలో మేడ పై భాగంలో ఠీవిగా కూర్చున్నాడు రావణుడు. శ్రీరాముడు రావణున్ని చూశాడు. వానర ప్రముఖులూ చూశారు. సుగ్రీవుడు ఒక్క ఉదుటున లేచి కోపంతో ఊగిపోతున్నాడు. క్షణాలలో సువేల పర్వతం నుంచి రావణ భవనంపైన వాలాడు. తాను శ్రీరాముని మిత్రుడనని, తన దగ్గర తప్పించుకోవడం లంకేశుని తరం కాదని హెచ్చరించాడు. రావణుడిపైకి దూకి అతని కిరీటాన్ని తీసి నేలకు కొట్టాడు. రావణుడు రెచ్చిపోయాడు. ''సుగ్రీవా! ఇంతవరకు నీవు నాకంటబడలేదు. లేకుంటే ఎప్పుడో హీనగ్రీవుడవు(తల తెగినవాడవు) అయ్యేవాడివి'' అంటూ గర్జించాడు. ఇద్దరి మధ్య బాహాబాహీ యుద్ధం జరిగింది. సుగ్రీవుడు రావణున్ని ముప్పు తిప్పలు పెట్టి క్షణాల్లో రివ్వున ఎగిరి సువేల పర్వతం మీద వాలాడు. శ్రీరాముడు సుగ్రీవున్ని సున్నితంగా మందలించాడు. తొందరపడి ఇలాంటి సాహసాలు చేయవద్దని సలహా ఇచ్చాడు.
పై పేరా చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. శ్రీరామచంద్రుడు తన పరివారంతో ఏ పర్వతానికి చేరుకున్నాడు?
2. లంకలో రావణుడు ఎక్కడ కూర్చున్నాడు?
3. సువేల పర్వతం నుంచి రావణ భవనంపైన వాలింది ఎవరు?
4. నాకంట బడితే నీవు హీనగ్రీవుడవు అయ్యేవాడివి అని ఎవరు ఎవరిని హెచ్చరించారు?
5. సుగ్రీవున్ని శ్రీరాముడు ఎందుకు మందలించాడు?
ఆ) ఈ క్రింది గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 5ఞ1ొ5
శ్రీకృష్ణదేవరాయలు క్రీ.శ.16వ శతాబ్దికి చెందినవాడు. సాహిత్యంపై ప్రత్యేక అభిమానం కలవాడు. భువన విజయమనే సభమండపాన్ని ఏర్పాటు చేసి సాహిత్య గోష్టులు నిర్వహించేవారు. అనేక మంది కవులను, పండితులను పోషించేవాడు. ఇతని ఆస్థానంలో ఎనిమిది మంది కవులు ఉండేవారు. వారిని ''అష్టదిగ్గజాలు'' అని పిలిచేవారు. అందులో అల్లసాని పెద్దన అగ్రగణ్యుడు. వికటకవిగా పేరుపొందిన తెనాలి రామకృష్ణుడు అష్టదిగ్గజ కవుల్లో ఒకడు. రాయలు రాజు మాత్రమే కాదు, గొప్ప కవి, పండితుడు కూడా. ''దేశ భాషలందు తెలుగు లెస్స'' అని తెలుగు భాషను కీర్తించాడు. ఇతని కాలంలోనే ప్రబంధాలు ఎక్కువగా వచ్చాయి. కావున ఈయన కాలం తెలుగు భాషకు స్వర్ణయుగమై కీర్తించబడింది.
సృజనాత్మకత 2ఞ5ొ10
ఉ) ఈ క్రింది వాటిలో ఏవేని రెండు ప్రశ్నలకు జవాబులు రాయండి.
17) మీరు సందర్శించిన ఏదేని పుణ్యక్షేత్రం గురించి మీ మిత్రునికి లేఖ రాయండి?
18) మీ గ్రామ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న మీకు తెలిసిన వ్యక్తిని అభినందిస్తూ అభినందన వ్యాసం రాయండి?
19) ''సమాజంలో మూఢనమ్మకాలను పారదోలడం'' అనే అంశాన్ని వివరిస్తూ ఒక 'కరపత్రం' తయారు చేయండి
పార్ట్ - బి
×. భాషాంశాలు (వ్యాకరణాంశాలు) 20ఞ1/2ొ10
అ) ఈ క్రింది వాటికి అడిగిన విధంగా సరైన జవాబులు గుర్తించండి.
1. దుర్ముహూర్తం విడదీయగా (సి)
ఎ) దు+ముహూర్తం బి) దుర్+ముహూర్తం
సి) దు:+ ముహూర్తం డి) దు:+సుముహూర్తం
2. ఈ క్రింది వానిలో త్రిక సంధికి ఉదాహరణ (ఎ)
ఎ)అవ్వీటి బి)రాజాజ్ఞ
సి)ఎవరైనా డి)మాయమ్మ
3. నల్లకలువలు విగ్రహ వాక్యం (సి)
ఎ)నల్లగా ఉన్న కలువలు
బి) నల్లటి కలువలు
సి) నల్లనైన కలువలు
డి) నల్లరంగు కలువలు గల పూవులు
4. ఉత్తర పదం ప్రధానంగా గలది (డి)
ఎ) కర్మదారయ సమాసం బి) ద్వంద్వ సమాసం
సి) ద్విగు సమాసం
డి) తత్పురుష సమాసం
5. ''వేదపురాణ శాస్త్ర పదవీనదవీయసియైన పెద్దము'' పద్యపాదం ఏ వృత్తానికి చెందినది (డి)
ఎ) చంపకమాల బి) శార్థూలం
సి) మత్తేభం డి) ఉత్పలమాల