India Languages, asked by narsing, 1 year ago

vemanna padyalu in telugu

Answers

Answered by snehitha2
9
★ఉప్పుగప్పురంబు న్రొక్కపోలికనుండు
చూడచూడ రుచుల జాడవేరు
పురుషులందు పుణ్య పురుషులువేరయ
విశ్వదాభిరామ వినుర వేమ!!

★అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తీయగనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ!!

★గంగిగోవు పాలు గరిటడైనను చాలు
కడివెడైన నేల ఖరముపాలు
భక్తికలుగు కూడు పట్టెడైననుజాలు
విశ్వదాభిరామ వినుర వేమ!!

★అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను
సజ్జనుండు పలుకు చల్లగాను
కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ!!

ఇవి కొన్ని వేమన పద్యాలు!

Hope it helps
Answered by jeevankishorbabu9985
2

Answer:

  • అల్పుడెపుడు పల్కు నాడంబరము గాను సజ్జనుండు బల్కు చల్లగానుకంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా విశ్వ దాభిరామ! వినుర వేమ!

ఓ వేమా! నీచుడైన వాడు ఎప్పుడూ ఆడంబరములు, గొప్పలు చెప్పును. మంచివాడు నెమ్మదిగా శాంతస్వభావుడై మాట్లాడును అదెట్లనగా , విలువలో తక్కువైనా కంచు గట్టిగా మోగును ,కానీ విలువైన బంగారం మ్రోగదు కదా? కావున మంచివాడెప్పుడూ అణుకువతో ఉంటాడు.

  • ఉప్పుకప్పురంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ, వినుర వేమా !

ఓ వేమా! ఉప్పు, కర్పూరం చూచుటకు ఒకే మాదిరి కనపడతాయి కానీ వాటి రుచులు వేరుగా ఉంటాయి. చూడటానికి అందరూ మనుషులొక్కమాదిరి గా కనిపించినా, పుణ్య పురుషులు అంటే సత్పురుషులు వేరుగా ఉంటారు. వారిని గుర్తించగలగాలి. అదే విజ్ఞత

  • తప్పులెన్ను వారు తండోపతండంబు ఉర్వి జనులకెల్ల నుండు తప్పు ,తప్పు లెన్ను వారు తమ తప్పులెరుగారు విశ్వదాభి రామ వినురవేమ

  • తల్లి దండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టవా ?గిట్టవా?విశ్వదాభి రామ వినురవేమ

తల్లిదండ్రులపైన దయతో ఉండాలి. వృద్ధాప్యంలో వారిని దయతో ప్రేమతో ఆదరించాలి. అలా చేయని కొడుకు ఉన్నా లేనట్టే. అలంటి వాడు పుట్టలోనే పుట్టి చచ్చే చెద పురుగులతో సమానం.

  • మేడి పండు చూడ మేలిమై యుండు పొట్టవిప్పి చూడ పురుగులుండు,పిరికివాని మదిని బింకమీలాగురా విశ్వదాభి రామ వినురవేమ!

మేడి పండు పైకి చక్కగా నిగ‌నిగలాడుతూ కనిపించినప్పటికీ దానిలో పురుగులుండే అవకాశం ఉంది. అలాగే పిరికి వాడు పైకి ధైర్యం ప్రదర్శించినప్పటికీ అతని మనసులో భయం ఉంటుంది.

  • వేరు పురుగు చేరి వృక్షంబు జెరుచును చీడపురుగు చేరి చెట్టు జెరచుకుత్సితుండు చేరి గుణవంతు జెరచురావిశ్వదాభిరామ వినురవేమ!

మహా వృక్షము కూడా వేరుకు పురుగుపడితే చచ్చిపోతుంది. చెట్టుకు చీడ పడితే ఆ చెట్టు నాశనమై పోతుంది. అలాగే చెడ్డవాడి వలన ఎంత మంచి వాడైనా చెడిపోతాడని అర్ధము. కాబట్టి చెడ్డ వాళ్ళతో స్నేహం చెయ్యకూడదు.

  • చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువగాదు విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంతో !విశ్వదాభి రామ వినుర వేమా!

ఓ వేమా! మంచి మనసుతో చేసిన పుణ్యం కొంచెమైనను భగవంతుని దృష్టిలో విశేషమైనది. మర్రి విత్తనము చాలా చిన్నదైనా , అది పెరిగి , మహా వృక్షము కాదా?

  • ఆత్మశుద్ధి లేని ఆచార మదియేల భాండశుద్ధి లేని పాకమేల? చిత్తశుద్ధి లేని శివపూజలేలరా ? విశ్వదాభి రామ వినురవేమ!

మనసు నిర్మలముగా లేకుండా ఆచారములు, పూజ‌లు పాటించడంవల్ల ప్రయోజనం లేదు. పాత్రలు శుభ్రముగాలేని వంట, మనసు స్థిరముగా లేని శివ పూజ వ్యర్థ‌మే. ఏ ప్రయోజనముండదు.

  • గంగిగోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైన నేమి ఖరము పాలు భక్తికలుగు కూడు పట్టెడైనను చాలు !విశ్వదాభి రామ వినురవేమ

ఓ వేమా! శ్రేష్టమైన ఆవు పాలు ఒక్క గరిటెడైనను విలువైనవే .గాడిద పాలు కుండనిండుగా ఉన్ననూ ఉపయోగము ఏమియు లేదుకదా! కావున భక్తి తో పెట్టిన భోజనము పట్టెడైనా తృప్తి నిచ్చును.

Explanation:

ధన్యవాదాలు తెలుపుతూ రాసిన వారు శ్రీ జీవన్ కిషోర్ బాబు

Similar questions