what is dasara importance in telugu
Answers
ప్రతీ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని నవమి వరకు దేవీ నవరాత్రులు అని అంటారు. ఈ 9రోజులు దుర్గాదేవిని వివిధ రూపాలతో అలంకరించి హిందువులు అత్యంత భక్తి శ్ర్రద్దలతో అమ్మవారిని పూజిస్తారు.ఆశ్వీయుజ మాసం నుండి వర్ష ఋతువు వెళ్ళి, శరత్ ఋతువు ప్రారంభం అవుతుంది కనుక నవరాత్రులను శరన్నవరాత్రులు అని కూడా అంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు.
నవరత్రుల సమయంలో అమ్మవారి అలంకారములు :
మొదటిరోజు బాలాత్రిపుర సుందరీదేవి
రెండోరోజు గాయత్రీ అమ్మవారు
మూడోరోజు అన్నపూర్ణాదేవి
నాల్గవరోజు లలితా త్రిపురసుందరి
అయిదవరోజు సరస్వతీదేవి (మూలా నక్షత్రం వచ్చినప్పుడు)
ఆరో రోజు మహాలక్ష్మి
ఏడవరోజు దుర్గాదేవి
ఎనిమిదవరోజు మహిషాసుర మర్ధిని
తొమ్మిదవరోజు రాజరాజేశ్వరీ అమ్మవారు
విజయదశమి
అమ్మవారు మహిషాసురుడుని సంహరించి, దుష్ట సంహారం చేసి సాధించిన విజయానికి గుర్తుగా దశమి తిధి నాడు విజయదశమిగా జరుపుకొంటారు.ఈ విజయదశమికి ఉత్తరాది వారు రాముడు రావణుడి ఫై విజయం సాదించి దుష్ట సంహారం చేసి, సీతమ్మను తిరిగి అయోధ్యకు తీసుకువచ్చిన వచ్చిన సందర్బానికి గుర్తుగా రావణుడి బొమ్మను కూడా దగ్దం చేసి ఈ పండుగను జరుపుకొంటారు.
పాండవులు 12ఏళ్ళు వనవాసం, 1 ఏడు అఙ్ఞాతవాస కాలం లో తమ ఆయుధాలను జమ్మి వృక్షం ఫై వుంచి,తిరిగి అఙ్ఞాతవాసం తర్వాత జమ్మి వృక్షమునకు పూజ చేసి ఆయుధాలను ధరించారు.కాబట్టి చాలా ప్రాంతాలలో ఈ రోజున ఆయుధపూజ ని చేస్తారు. కొన్ని ప్రాంతాలలో జమ్మి ఆకులను కూడా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొంటారు.
The human body is in constant change the minute we're born. It's in a constant state of decay. We're all like Ford Escorts, just falling apart.