World Languages, asked by mohit5084, 11 months ago

why should we read Ramanayam. in 150 words. in Telugu​

Answers

Answered by tannigang
1

Answer:

ఎవరికో తోచక రాసిన కథో నవలో కాదు. యుద్దానంతరం జరిగిన సన్నివేశాలను కళ్లారా చూసినట్టు గోచరించే వరాన్ని వాల్మీకి మహర్షికి చతుర్ముఖుడు ప్రసాదించాడు. ఆ ఆదృష్టాన్ని ఉపయోగించి వాల్మీకి రామాయణంలోని ప్రతీ స్పందనను ఉన్నది ఉన్నట్టు రాశారు. మానవత్వం అంటే ఎలా ఉండాలో రామాయణం అడుగడుగునా వివరిస్తుంది. అన్ని సన్నివేశాల్లోనూ మానవత్వం పరిమళిస్తుంది. జాతికి ఎప్పుడూ ఆక్రమణలు కాదు, ఆనందం పంచడం కావాలి.. ఒకరిది దోచుకోవడం కాదు, ఒకరికి ఆనందం ఎలా పంచాలనే విషయాన్ని వివరిస్తుంది. శ్రీరాముడికి దశరథుడు రాజ్యపాలన అప్పగించాలని భావించినా, కైకేయి మాత్రం భరతునికి ఇవ్వాలని కోరింది. ఇదే విషయం రాముడితో కైకేయి చెబుతుంటే, ఇందులో అంతగా సంకోచించాల్సిన, సందేహించాల్సిన అవసరం ఏముంది.. రామా అడవికి వెళ్లు అని ఒక్క మాట చెబితే చాలు సంతోషంగా వెళ్తానని శ్రీరాముడు బదులిచ్చాడు.

చిత్రకూటంలో ఉన్నప్పుడు శ్రీరాముని వెదుకుంటూ భరతుడు తన సైన్యంతో వచ్చాడు. వేలాదిగా సైనికులు రావడంతో అడవిలో జంతువులు, పక్షులు చెల్లాచెదురు అయ్యాయి. దీన్ని గమనించిన రాముడు.. ఎవరైనా వేటకు వచ్చారా, ఏదైనా యాత్ర జరుగుతుందా తెలుసుకోమని లక్ష్మణుడికి చెప్పాడు. అంతట చెట్టు ఎక్కి చూసిన లక్ష్మణుడు.. భరతుడి రాకను తప్పుగా అర్థం చేసుకున్నాడు. వనవాసం అయ్యాక తిరిగి రాజ్యాన్ని అప్పగించడం ఇష్టంలేక భరతుడు మనపై దాడికి వస్తున్నాడు.. ధనస్సును సిద్దం చేసుకుని సీతమ్మను దాచిపెట్టు అని కేకలు వేశాడు.

అప్పుడు రాముడు భయం ఎందుకు లక్ష్మణా.. ఒక వస్తువుపై అత్యాశ పెంచుకున్నప్పుడు, దాన్ని దూరం చేస్తారేమోనని భయపడాలి.. అలాంటిది ఆశే లేనప్పుడు భయం ఎక్కడ ఉంటుందని అన్నాడు. భరతుని గురించి నాకు తెలుసు.. తనకి రాజ్యంపై కాంక్ష ఉందని నీవు భావిస్తే, నాతోపాటు తనను వసవాసానికి రమ్మంటా, నీవు వెళ్లి రాజ్యాన్ని పాలించు అని చెప్పాడు. శ్రీరాముడి మాటలకు వెంటనే సిగ్గుతో తల దించుకున్న లక్ష్మణుడు పశ్చాత్తాపడ్డాడు. అయితే లక్ష్మణుడికి రాజ్యంపై ఆశ కాదు, రాముడిపై ప్రేమాతిశయం. మనం చుట్టూ ఉన్న వారితో ఎలా ప్రవర్తించాలో రామాయణం తెలియజేస్తుంది. అందుకే దీనిని ఇతిహాస శ్రేష్టం అని అంటారు.

Similar questions