Wisdom of heart and wisdom of head in telugu essay s in words
Answers
Telugu essay on "Wisdom of heart and Wisdom of head."
ఈ పంక్తి మెదడు మరియు హృదయం తమ ఆలోచనలకు ఇచ్చే స్వతంత్రాన్ని మధ్య బేధాలను సులువుగా వివరించింది.
There is a wisdom of the head :
అనగా మన మెదడు తార్కిక మరియు హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకోవడంలో దారి చూపిస్తుంది. అనగా మనం ఒక విషయమును చెయ్యడం చేయకపోవడం అనే విషయాన్ని మన మెదడు యొక్క నిర్ణయానికి వదిలితే, మన మెదడు ఆ పని చెయ్యడం వాళ్ళ వచ్చే లాభాలు, నష్టాలు ఇంకా ఎన్నో విషయాలను పరిగణిస్తూ చివరిగా ఒక నిర్ణయానికి వస్తుంది. ఇందులో భావోద్వేగాలకు తావులేదు.
And a wisdom of the heart :
అనగా మన హృదయం మన భావోద్వేగాలను అర్ధం చేసుకుంటూ మన మనస్సుకు ఏదైతే మంచిది అనిపిస్తుందో, ఏదైతే మనకు ఆనందాన్ని మరియు తృప్తిని ఇస్తుందో ఆ పనిని మన హృదయం చేయిస్తుంది. ఇది మెదడు ఆలోచనలకు భిన్నంగా ఉంటుంది. ఇక్కడ లాభ నష్టాలు లాంటివి, పరిణామాలు, తీవ్రతలు పరిగణలోకి తీసుకోవు. అంత ఇష్టం పైనే ఆధారపడి ఉంటుంది.
ఉదాహరణకు, మీకు ఒక ఉద్యోగం వచ్చింది. కుటుంబానికి దూరంగా వెళ్ళాలి.
అలాంటప్పుడు, భాధ ఐన సరే, మనకు డబ్బులు వస్తాయ్, భవిషత్తు బాగుంటుంది అని లెక్కలు వేసుకుని వెల్దాము అని అనుకుంటే అది "Wisdom of head" అవుతుంది .
లేదు. మనవాళ్ళని వదిలి ఉండలేను. ఇక్కడే ఒక మంచి ఉద్యోగం చూసుకుంటాను అని మనసు చెప్పనా మాట వింటే అది "Wisdom of heart" అవుతుంది.
ఐతే రెండు పరమైన జ్ఞానాలు ముఖ్యమైనవే. ప్రతి విషయాన్ని మెదడుతో ఆలోచించుట ప్రమాదకరమే, అలాగే ప్రతిదీ హృదయంకై వదిలేయటం కూడా ప్రమాదకరమే. ఏ విషయాన్ని ఎలా చూడాలి, ఎలా పరిష్కరించాలి అనే అవగాహన ఇక్కడ ఉపయోగపడుతుంది. జ్ఞానానికి మించిన ధైర్యం లేదు. అలా అని ప్రతి విషయాన్ని మెదడుతోనే ఆలోచిస్తూ, హృదయ స్పందనకు విలువని ఇవ్వకుంటే మనకు మరమనిషికి తేడా లేదు కదా!
పెద్దవాళ్ళు ఆశీర్వదించేటప్పుడు బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుతారు భగవంతుడిని. జ్ఞానాన్ని మించిన ఆయుధం లేదు. దానితో జయించలేని పని ఈ సృష్టిలో లేదు. అయితే దానిని మంచి పనికి, లోక కల్యాణానికి, ఇతరులకు హాని కలుగకుండా వాడితే ఆ జ్ఞానమే మనల్ని ప్రగతి పథంలో నిలపెడుతుంది. ఆ జ్ఞానం హృదయం తో తీసుకున్నది ఐన సరే లేక మెదడుతో తీసుకున్నది ఐన సరే.
పుస్తకంలోనిది చదివి పరీక్షలో రాసి వచ్చి మర్చిపోతే అది జ్ఞానం కాదు. దాని వాళ్ళ మంచి మార్కులు వచ్చినా ప్రయోజనం లేదు. అలా కాక పుస్తకంలోనుంచిపెంచుకున్న జ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు మేలుచేసే విధంగా ఎం చేసిన సరే దానికన్నా ఉత్తమమైనది ఇంకొకటి లేదు. అందుకే కదా అసలు విద్య అన్న విషయానికి అంత ప్రాధాన్యత ఉన్నది.
చివరిగా చెప్పేది ఒక్కటే. మెదడుతో తీసే జ్ఞానం మరియు హృదయం ఇచ్చే జ్ఞానం రెండు వేరు వేరు అయినను రెండు ఉత్తమమైన ఆయుధాలే. ఏది ఎప్పుడు ఎక్కడ పరిగణించాలి తెలిస్తే ఆ జ్ఞానమే మిమ్మల్ని జీవితంలో ప్రజా యోధులుగా తీర్చిదిద్దుతాయి.
Learn more :
1. “ళం" అక్షరం తో ముగిసే తెలుగు పదాలు కనుక్కోండి. 1.ఆకు, సేన 2.గొంతు...
brainly.in/question/17342729
2. Guess the telugu movie. 1) కన్య తల్లి =2) బంగారు పువ్వు =3) కష్టాల్లో రక్షించేవాడు =...
brainly.in/question/16564851