India Languages, asked by saraswathi7, 11 months ago

write a letter to your friend on Telugu language importance (in Telugu)

Answers

Answered by poojan
27

Letter to a friend on Telugu language's importance

ప్రియమైన మిత్రురాలు ప్రియకు,

నీ ప్రియమిత్రురాలు దీపికా వ్రాయునది ఏమనగా,  

ఇక్కడ అందరు క్షేమంగా ఉన్నాము. నువ్వు, మరియు మీ కుటుంబసభ్యులు కూడా క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మనం మాట్లాడుకుంటున్న ఈ తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని గురించి మా మాస్టారు గారు చెప్పారు. ఆ విషయాలు నీతో పంచుకుందామని ఈ ఉత్తరం రాస్తున్నాను.  

దేశ భాషలందు తెలుగు లెస్స' అన్నారు శ్రీ కృష దేవరాయలు. తెలుగు భాషను 'ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్' అని బ్రిటిషు రచయితలు 19వ శతాబ్దంలోనే కొనియాడారు. అటువంటి తెలుగు భాషను పురస్కరించుకోవడానికి, ఆనందంగా జరుపుకోవడానికి మన భాహకంటూ ఒక రోజును కేటాయించారు.  

ప్రతి సంవత్సరం ఆగష్టు 29న ఆంధ్ర రాష్ట్రంలో  తెలుగు భాషా దినోత్సవానికి మనం జరుపుకుంటున్నాం. తెలుగు బాహా ప్రాచీనమైనది, అమూల్యమైనది. ఈ దినోత్సవాన్ని తెలుగు భాష కవి ఐన గిడుగు రామమూర్తి గారి పుట్టినరోజు నాడు ఐన ఆగష్టు 29న మనం జరుపుకోవడం గమనార్హం. ఈయన బ్రిటీషు కాలంలో ఒక ప్రసిద్ధ కవి.  

ఎంతో గొప్పదైన ఆ రోజున ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం తెలుగు భాష అభివృద్ధికై కృషి చేస్తూ, ఎన్నో పురస్కారాలు, సన్మానాలు చేసి దీనికి పాటుపడేవారిని కొనియాడుతుంది. మన భాష ఎంత గొప్పదో కదా!  

అన్నట్టు సంక్రాంతి పండుగ వస్తుంది కదా. సెలవులలో మా పల్లెటూరికి రా. నీకు ఈ పండుగ విశిష్టతను చూపిస్తాను.  

ఇట్లు,

నీ ప్రియమిత్రురాలు,

దీపిక.

Learn more :

1) 1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?

brainly.in/question/16066294

2. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు

brainly.in/question/16302876

3. సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ కనిపెట్టండి

brainly.in/question/16289469

Similar questions