World Languages, asked by sreekarreddy91, 2 months ago

Write a paragraph on Blacksmith ( కమ్మరి ) in Telugu​

Answers

Answered by shrikantmohite76
3

Answer:

విశ్వకర్మీయుల/విశ్వబ్రాహ్మణుల పంచ వృత్తులలో మొట్టమొదటి వృత్తి కమ్మరము.ఇనుమును కరిగించి వస్తువును తయారు చేసి ప్రపంచ పారిశ్రామిక వ్యవస్థకు మూల పురుషుడు లోహశిల్పి కమ్మరి. ప్రపంచంలో ఏ వస్తువు తయారు కావాలన్నా కమ్మరి కొలిమిలో కాసీ డాకలి పై సుత్తె దెబ్బలు తినాల్సిందే. భగభగ మండే కొలిమి ముందు కూర్చుని వేడిని లెక్క చేయక రైతుకు అవసరమైన పనిముట్లు చేస్తాడు. కమ్మరి కొలిమి రాజేసి ఇనప ముక్కలతో కొడవళ్ళు గునపాలు నాగళ్ళు చేస్తాడు. కొడవళ్ళకు కక్కు కొడతాడు.రెడీమెడ్‌ పనిముట్లు, ఆధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో ఇనుముతో రకరకాల పనిముట్లు తయారు చేసే కమ్మరి కి పని పోయింది.రైతులు గతంలో మాదిరి కొలిమి దగ్గరకు వచ్చి తమకు కావాల్సిన వస్తువులు చేయించుకొనే ఓపిక ఇప్పుడు లేదు. దాంతో వారు రెడీమెడ్‌ పనిముట్లు తీసుకొని తమ పనులు గడుపుకొంటున్నారు. అనావృష్టి, అతివృష్టితో రైతులు వ్యవసాయం చేయకపోవడంతో వ్యవసాయ పనిముట్లుతయారు చేసే కమ్మరి పని పోయింది.వీరు ఇప్పుడు ప్రవేటు ఫ్యాక్టరీలలో కార్మికులయ్యారు.కదిరి ప్రాంతంలో ముస్లిములు ఎక్కువమంది కమ్మరి పని చేస్తున్నారు.ఆధునిక యంత్ర పనిముట్లు రావడం వల్ల కమ్మరి వృత్తి పూర్తిగా అంతరించిపోవుటకు సిద్దమైంది. ట్రాక్టర్లు రావడం వల్ల నాగళ్లు, పొలాన్ని దున్నేందుకు ఉపయోగం లేకుండా పోయాయి. వరి కోత మిషన్లు రావడం వల్ల కోసే కోడవలి కూడా ఉపయోగపడకుండా ఉంది.కొలిమి దగ్గర ఉండి ఇనుప సామాన్ల తయారీలో ప్రమాదవశాత్తు మరణిస్తే భీమా సౌకర్యం కల్పించాలి అని వీరి డిమాండు. విశ్వబ్రాహ్మణ / విశ్వకర్మ కులస్తులు సాంప్రదాయ కమ్మరులు. వీరు ఆంధ్రప్రదేశ్ బి.సి.జాబితాలో 21వ కులంగా చేర్చబడినారు.

పూర్వం ఈ వృత్తిని చేసికొని బతికే సంచార జాతి ఇంకొకటి వున్నది. వారిని 'బైట కమ్మరులు అంటారు. వీరు ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు తెగల జాబితా లో 10వ కులం. వీరు కమ్మరి పనికి కావల్సిన పని ముట్లతో ఊరూరు తిరుగుతుంటారు. వీరు ఊర్లోకి రాకుండా ఊరి బైటనే కొలిమి పెట్టుకుని కొద్ది రోజులు ఉండి వెళ్ళి పొతారు. వీరికీ విశ్వబ్రాహ్మణులకు ఎటువంటి పోలిక కానీ సంబంధంకానీ లేదు.

Answered by tennetiraj86
7

Explanation:

కమ్మరి :-

ఇనుము మరియు ఇనుమునకు సంబంధించిన పనిముట్లు మరియు వస్తువులను తయారుచేయుటను వృత్తిగా కలిగిన ప్రజల సమూహము.

వీరిని కమ్మరి అని వీరు చేసే పని ప్రదేశాన్ని కమ్మరి కొలిమి అని అంటారు .

నిత్యం మంటల మధ్యలో బలమైన ఇనుము వస్తువులతో చెమటలు కక్కుతూ అద్భుతమైన వస్తువుల్ని అందించగల బహు సమర్థులు వీరు.

ఆది మానవుడు రాళ్లతో వస్తువులను తయారుచేసుకుని జీవనం సాగిస్తున్న క్రమంలో ఈ ఇనుము వాడకం మొదలు పెట్టిన తరువాత జీవన విధానంలో పెను మార్పులు సంభవించాయి.

మానవుడు ఇనుము వాడకం నేర్చుకున్నాడు దానితో భయంకర జంతువుల నుండి రక్షణ కల్పించుకున్నాడు .

ఇనుము ను వేడి చేయుట ద్వారా అది వ్యాకోచించి తగిన ఆకృతిని తయారు చేయగలడం నేర్చుకున్నాడు.

రాజుల పరిపాలనలో వారికి కావలసిన కత్తులు ,కటారులు అన్ని వీరి ద్వారా జరగవాల్సినదే.

మొదటి కమ్మరి వృతిని 1500బీసీ లో సిరియా లో కనుగున్నారని ప్రతీతి.

వీరు మొదట సంచార జీవనం గడిపి తరువాత కొన్ని ప్రాంతాలలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు.

ఇప్పటికీ కూడా సంతలలో ,బజారులలో వీరిని వీరి తయారీ పనిముట్లను చూస్తూనే ఉంటాం.

వంట గది సామానులు , చెట్లను కొట్టు గొడ్డళ్లు ,భూమిని పేకళించు గడ్డ పారలు, పొలాన్ని సేద్యానికి ఉపయోగపడు నగలు,పారలు అన్ని వీరి శారీరక శ్రమ మరియు మానసిక సృజనాత్మకత కు అద్దం పట్టునవి.

ఇప్పటికి వీరి ప్రయోజనము పొందదగినది.వీరు కత్తులు,కొడవాళ్ళు,పారలు,గుణాపాలు, లేని ఇల్లు ఉండదు అంటే అది అతిశయోక్తి కాదు.

కానీ పోటీ ప్రపంచంలో చాలా ఇబ్బందులను వీరు ఎదుటకోవాల్సిన వచ్చుచున్నది .కావున ప్రభుత్వాలు తగిన ప్రోత్సాహకాలు అందిస్తే వీరి ద్వారా వచ్చే అనేక పనిముట్లు మన దేశ భవిత్వానికి సహాయపడగలవని చెప్పుటలో ఎంతమాత్రము అతిశయోక్తి లేదు.

Similar questions