India Languages, asked by gauthammareedu, 2 months ago

write what you know about singarani karmikulu in Telugu​

Answers

Answered by BarbieBablu
72

 \huge \bold \color{navy}{❥} \underline \color{red}{సింగరేణి \: కార్మికులు}

సింగరేణి సంస్థ తెలంగాణా అభివృద్ధి, ఆత్మగౌరవ, రాష్ట్రసాధన ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించింది.. దీంతో సింగరేణి సంస్థ శ్రామికుల సంక్షేమం తెలంగాణా ఏర్పడ్డ తర్వాత ముఖ్యమైన అంశమయింది.. ఎప్పటినుంచో ఉన్న వారసత్వ ఉద్యోగాల ప్రతిపాదన అమల్లోకి వచ్చింది. 2016 నవంబరులో వారసత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు సింగరేణి సంస్థ అంగీకరించింది. దీనికి సంబంధించి 15ఏళ్ల తర్వాత చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 2016 అక్టోబర్‌ 11 నాటికి 48-56 వయస్సు మధ్యగల కార్మికులు వారసత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కార్మికుల కుమారులు, అల్లుడు, సోదరుడు వారసత్వ ఉద్యోగాలు పొందేందుకు అర్హులని పేర్కొంది. అయితే 18-35 ఏళ్ల వయసున్న వారిని మాత్రమే అర్హులుగా పరిగణిస్తామని ప్రకటించింది.

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలపై 2002లో అప్పటి ప్రభుత్వ నిషేధం విధించింది. దీంతో కార్మిక సంఘాలు అనేక ఉద్యమాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. అయితే తెలంగాణా రాష్ట్రసాధనా ఉద్యమ సమయంలో, 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో సింగరేణి వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరిస్తామని తెరాస రాజకీయ పార్టీ హామీ ఇచ్చింది. దానికి అనుగుణంగానే అ అంశంపై పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించిన ప్రభుత్వం.. వారసత్వ ఉద్యోగాల ప్రతిపాదనను అంగీకరించింది..

Similar questions