Social Sciences, asked by yashwanth0333, 1 year ago

మీ ప్రాంతంలోని లేదా మీరు చూసిన వాగు / చెరువు / నదిని వర్ణిస్తూ కవిత | గేయాన్ని రాయండి.​

Answers

Answered by srabani80pal
14

Answer:

Explanation:

భూమిని తడి తడి చేసిన వాన కురువక కురువక ఇరుగ కురిసిన వాన నీళ్లు లేని పల్లెల మీద నీలి నీలి వాన వాన ..వాన ... నేల నేలంతా పదన చేసిన వాన ఇసిరి ఇసిరి కొట్టిన వాన లగాంచి దంచి సంపిన వాన తెల్లందాక పొద్దుందాక వొక్కటే వాన కరువు తీరా వాన ,కుతి తీరా వాన దూప తీర్చిన వాన ,కడుపు నింపిన వాన కండ్ల సంబ్రమై తనివి తీర్చిన వాన వానల జోరుకు ఒర్రెలు ఒర్సుకు పోయినై వాగులు ఒర్రెలు కల్సి చేరువుల్లు నిండినై అలుగులే దునికినై ,మత్తల్లు బోర్లినై నదులు నాదాలై నాట్యాలే చేసినై వాన ..వాన ...వాన .. ఇంట్లకెళ్ళి ఎల్లకుంట రాలిపడిన వాన కాళ్ళు తర్ర పెట్టకుంట ఆపిన వాన దారులన్నీ నదులై ప్రవహించిన వాన కాలువలు తెగ తెంపిన కనరు వాన పాత ఇండ్లు గోడలు పడగొట్టిన వాన ఎవసాయదారులకైతే నెనరైన వాన నదుల నిండార్గ పరుగు పెట్టిన నీళ్లు ప్రాజెక్ట్ లకు కళ తెచ్చిన నీళ్లు బ్రిడ్జిలను రోడ్లను ముంచెత్తిన నీళ్లు కెనాల్లు కొట్టుక పోయేట్టుగ నీళ్లు ..నీళ్లు గల గల నీళ్లు జల జల నీళ్లు నీళ్లంటే జీవితం నీళ్లుంటేనే జీవునం నీళ్లు నాగరిక వికాసానికి ప్రాణా ప్రాణం Sponsored A Modern Penthouse in West London Mansion Global Sponsored Runway Prestige Expands Their New York Fashion Week… ReleaseWire - Latest Press… ఇన్నోద్దులుగ నీళ్లంటే సుడులు తిరిగిన కన్నీళ్లు నేల నెర్రెలిడిసిన పర్రెలు పర్రెలు పాతాళం లోకి పారి పోయిన పదన సుక్క నీళ్ల కోసం తపిచ్చిన తనువులు నీళ్ల కోసమే మైళ్ళకు మైళ్ళు కాళ్ళు కాలం కలిసివచ్చి గంగను నెత్తిన తెచ్చింది ఎల్నినోను ఎల్లెల్కల పడగొట్టి లానినో ఎండిన నేలను ముద్దాడింది నిండు చూలాలై నీళ్లు నీల్లాడినై నీళ్ళోస్తే పునాసలు పువ్వులైతై పైర్లు పచ్చ పచ్చగ ఊగుతై మక్క కంది గట్టి గింజలు పోస్తయి ఆరోక్క పంటలకు నీళ్లు బంగారం పల్లె పల్లెకు చెరువులు సింగారం నీరు కట్టెలు నీళ్లల్ల బిరబిర ఉరుకుతై గొండ్రిగాల్లు గుర్రు గుర్రు మంటై కోర్రమట్టలు సందమామలు జల్లలు పర్కలు శాపలన్నిటికీ నీళ్ళు సంబుర సంసారం చెర్లు కొప్పురంగ నిండితేనే చేలకల నవ్వు చెర్లు గంగాళం అయితేనే ఎవుసం పువ్వు వాన కాలం వాసనకు దువ్వెనల గుంపులు ఊరవిశ్కల కిస కిస దనులు మడికట్ల పొన్న తెల్లతెల్లని కొంగల గుంపు కంచెలల్ల పచ్చని గర్కపోసల గవ్రాంతం గొర్లు మ్యాకలకు కడుపు నిండే అన్నం ఆకాశం మీద నీలి మబ్బుల యానం నేల మీద నీళ్ల వయ్యారం ఇయ్యడు పల్లెలన్ని పెద్ద ముత్తైదువలై నవ్వుతున్నై నిత్తె పెద్ద బతుకమ్మలై ఆడుతున్నై - అన్నవరం దేవేందర్

Similar questions