India Languages, asked by kandirahul151, 5 months ago

నదుల వల్ల ఉపయోగాలు ఏమిటి?​

Answers

Answered by anirudhbangaruanirud
12

వర్షపు నీటి వలన కాని, ఎత్తయిన పర్వతాలలో మంచు కరిగిన నీటి వలన కాని చిన్న చిన్న పాయలుగా ప్రవహిస్తూ అవి ఒకదానికొకటి ఏకమై పెద్ద ప్రవాహంగా మారడమే నదిగా పరిగణించబడుతుంది. సాధారణంగా పెద్ద నదులు పర్వత ప్రాంతాలలో పుట్టి వేల కిలోమీటర్లు ప్రవహించి చివరికి సముద్రాలలో అంతమౌతాయి. కొన్ని నదులు భూమిలోనే ఇంకిపోతాయి. పశ్చిమ అమెరికా లోని ఎడారులలోను, సౌదీ అరేబియా లోని ఎడారులలోను ఇలా భూమి లోకి ఇంకిపొయే నదులు ఉన్నాయి. ఇవి వర్షాలు పడ్డప్పుడు మాత్రం పొంగి పొర్లుతాయి. వర్షం ఆగిపోగానే మిగిలిన నీరు నేలలోకి ఇంకిపోయి ఎండి పోతాయి. మన వైపు దొంగేర్లు ఇలాంటివే. ఇలా ఇంకిపోని నదులనే మనం జీవనదులు అంటాం. నేల లోకి ఇంకి పోగా మిగిలిన నీరే జీవనదులలో ప్రవహించేది. ఎంత నీరు ఇంకుతుందీ అనేది నదీ గర్భం అడుగున ఉన్న రాతి పొరల లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. అడుగున సున్నపు రాయి (లైమ్‌ స్టోన్‌) ఉంటే ఎక్కువ నీరు ఇంకే సావకాశం ఉంది. అడుగున నల్లసేనపు రాయి (గ్రేనైట్‌) ఉంటే నీరు అంతగా ఇంకదు.

Answered by qwselecao
11

నదుల వల్ల ఉపయోగాలు:

  • వర్షపు నీటి వలన కాని, ఎత్తయిన పర్వతాలలో మంచు కరిగిన నీటి వలన కాని చిన్న చిన్న పాయలుగా ప్రవహిస్తూ అవి ఒకదానికొకటి ఏకమై పెద్ద ప్రవాహంగా మారడమే నదిగా పరిగణించబడుతుంది.
  • . సాధారణంగా పెద్ద నదులు పర్వత ప్రాంతాలలో పుట్టి వేల కిలోమీటర్లు ప్రవహించి చివరికి సముద్రాలలో అంతమౌతాయి. కొన్ని నదులు భూమిలోనే ఇంకిపోతాయి.
  • ఎంత నీరు ఇంకుతుందీ అనేది నదీ గర్భం అడుగున ఉన్న రాతి పొరల లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది.
  • నదుల వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి . నది నీరు త్రాగు మరియు సాగునీరుగాను ఉపయోగపడుతుంది .
  • పూర్వం మానవ నాగరికతకు మూలం ఈ నదులే .
  • మన దేశంలో గంగ,యమునా ,గోదావరి ,కృష్ణ వంటి జీవనదులు వాటి మీద ఆధారపడ్డ కోట్లాది మంది ప్రజలకు జీవనోపాది కల్పిస్తున్నాయి .
  • మత్స్యకారులు నదుల మీద ఆధారపడి జీవిస్తారు .

PROJECT CODE:-SPJ2

Similar questions